ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ !

పవన్ కళ్యాన్ కుటుంబ సభ్యులంతా ఈ రోజు ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారం జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు.

Update: 2024-06-12 09:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారంలో భాగంగా ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్ అశేష జనవాహిణి, జనసైనికులు, అభిమానులు, కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేయడంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. నిన్న సాయంత్రమే చిరంజీవి సతీమణి సురేఖతో పాటు కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. పవన్ కళ్యాన్ కుటుంబ సభ్యులంతా ఈ రోజు ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారం జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #PawanKalyanAneNenu, #GameChanegerPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా తదితర ప్లాట్ ఫామ్ లలో ట్రెండింగ్ అవుతుంది, ఇప్పటి వరకు #PawanKalyanAneNenu హ్యాష్ ట్యాగ్ పై ఒక్క ట్విట్టర్ లో లక్ష 6 వేల పోస్టులు పెట్టడం విశేషం. ఇక పవన్ ప్రమాణ స్వీకారానికి భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన, కుమార్తె ఆద్యలు కూడా హాజరయ్యారు.

Tags:    

Similar News