పవన్ ఉత్తరం, బాబు దక్షిణం !

ఇక‌, ఇదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో ప‌ర్య‌టిం చ‌నున్నారు.

Update: 2023-12-26 15:03 GMT

ఒక‌వైపు కుప్పం.. మ‌రోవైపు కాకినాడ ఈ రెండు ప్రాంతాల్లోనూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల రాజ‌కీయాల‌తో మ‌రింత‌గా పాలిటిక్స్ వేడెక్కాయి. ఒకే సారి.. ఒకే స‌మ‌యంలో అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన‌లు రాజ‌కీయాల‌ను వేడెక్కిం చే కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ నెల 28 నుంచి వ‌రుస‌గా మూడు రోజులు కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో ప‌ర్య‌టిం చ‌నున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలూ క‌లిసి పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో ఇరు పార్టీల అధినేత‌లు దాదాపు ఈ నెల ఆఖ‌రు నుంచే పూర్తి స్థాయి కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు సాగ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కుప్పంలో చంద్ర‌బాబు, కాకినాడ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల ప‌ర్య‌ట‌న‌లు హీటెక్కించ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాకినాడ కేంద్రంగా పవన్ కల్యాణ్ రాజకీయ సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ నెల 28,29,30 తేదీల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందనే దానిపై సమీక్ష తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కాకినాడపైగా దృష్టి పెట్టి పవన్ మూడు రోజుల సమీక్ష నిర్వహిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ స‌మీక్ష‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు కూడా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న గెలుపుపైనా కార్య‌క‌ర్త‌ల‌నుస‌మాయ‌త్తం చేయ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు ర‌చిస్తున్న నేప‌థ్యంలో చంద్ర బాబు ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఓడించ‌డంకాదుక దా.. క‌నీసం మెజారిటీని త‌గ్గించేం దుకు కూడా ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు ప‌క్కా స్కెచ్ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో అటు కుప్పంలోనూ..ఇటు కాకినాడ‌లోనూ రాజకీయ కాక మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News