అమ్మాయిల మిస్సింగ్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు!

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంపికవ్వడం తెలిసిందే.

Update: 2024-07-02 13:25 GMT

ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగిన వారాహి యాత్రలో పవన్ ఒక సంచలన విషయాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో సుమారు 30వేల మంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అయ్యారని.. ఈ మేరకు తనకు కేంద్ర నిఘావర్గాల సమాచారం ఉందని.. ఈ విషయంలో వీరిని మిస్ చేసే వారికి వాలంటీర్లు సహకరించారని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంపికవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల అదృశ్యంపై చేసిన ఆరోపణలపై ఇప్పుడు చర్యలు ఏవి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ ఏపీలో మహిళల అదృశ్యంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఏకంగా 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘాటించారు. గతంలో తాను లేవనెత్తిన ఈ విషయాన్ని ఆ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని.. అయితే తమ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఆ విషయంలో వర్క్ స్టార్ట్ చేసిందని తెలిపారు.

సాదారణంగా ఒక అమ్మాయి మిస్ అయితే 24 గంటలు లేదా 48 గంటలు దాటితే ఇంక మరిచిపోవడమే, వారిని గుర్తించడం దాదాపు అసాధ్యం అని అంటుంటారని అయితే... ఏపీ పోలీసులు మాత్రం 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసులను అభినందిస్తున్నట్లు పవన్ తెలిపారు.

Read more!

ఇందులో భాగంగా... ఇటీవల ఓ మహిళ తన కూతురు కిడ్నాప్ అయ్యిందని తనకు ఫిర్యాదు చేసిందని.. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశామని చెప్పారు. దీంతో పోలీసులు అద్భుతంగా పనిచేసి 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో చేధించారని. ఆ అమ్మాయి జమ్మూకశ్మీర్ లో ఉన్నట్లు గుర్తించారని తెలిపారు.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే... ప్రభుత్వం తలచుకుంటే ఏమి చేయగలదో నిరూపించడానికే అని తెలిపారు. గత ఐదేళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా గత ప్రభుత్వంలో కదలిక రాలేదని.. అయితే ఈ ప్రభుత్వం పాలనలో మార్పును ప్రజలు గమనించాలని అన్నారు. ప్రధానంగా తల్లితండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ సూచించారు.

ఇదే సమయంలో ఆడపిల్లల అదృశ్యంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తామని పవన్ తెలిపారు. దీంతో.. అదృశ్యమైన 30వేల మంది అమ్మాయిల ఆచూకీ కూడా త్వరలో కనిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... ఈ రీల్ "అన్నవరం"... రియల్ హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News

eac