నాడు గెలిపించిన పీకె .. నేడు ఓడించిన పీకె

గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయి అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

Update: 2024-06-04 11:17 GMT

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ 175 స్థానాలకు 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తెరవెనక కీలకపాత్ర పోషించాడు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 23 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయింది.

గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయి అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. దీంతో గత నాలుగేళ్లుగా ఎంతో కసిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కోసం పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నించాడు. అనుకున్న ప్రకారం విజయం సాధించాడు.

ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ హిట్ విజయం దిశగా దూసుకువెళ్తున్నది, గత ఎన్నికల్లో 151 స్థానాలలో విజయం సాధించిన వైసీపీ ప్రస్తుతం 13 స్థానాలకే పరిమితం అవుతున్నది. కనీసం 18 స్థానాలు సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించే పరిస్థితులు లేవు. గత ఎన్నికల్లో ఆ పీకె గెలిపిస్తే .. ఈ ఎన్నికల్లో ఈ పీకె దారుణంగా ఓడించాడని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Tags:    

Similar News