ఇకపై విదేశాల్లోనూ 'పేటీఎం కరో'... యాక్టివేషన్ ఎలా అంటే..?

ఈ సందర్భంగా పలు దేశాల్లో చెల్లింపులు చేసేందుకు కస్టమర్లకు అనుమతిస్తుంది.

Update: 2024-11-20 04:59 GMT

కొన్ని దేశాలకు వెళ్లినప్పుడు చేతిలో స్థానిక కరెన్సీ లేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది! అయితే.. అలాంటి వారి కోసం తాజాగా పేటీఎం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... కొత్త అంతర్జారీయ యూపీఐ ఫీచర్ ని పేటీఎం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా పలు దేశాల్లో చెల్లింపులు చేసేందుకు కస్టమర్లకు అనుమతిస్తుంది.

అవును... తన వినియోగదారులకు పేటీఎం ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా.. కొత్త అంతర్జాతీయ యూపీఐ ఫీచర్ ను తెరపైకి తెచ్చింది. ఫలితంగా... సింగపూర్, ఫ్రాన్స్, యూఏఈ, మారిషస్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో చెల్లింపులు చేసేందుకు కస్టమర్లకు అనుమతి ఇస్తుంది. ఈ దేశాల్లో పేటీఎం యాప్ ఉపయోగించొచ్చు!

పైన పేర్కొన్న దేశాలో పేటీఎం యాప్ ని ఉపయోగించి షాపింగ్, డైనింగ్ తోపాటు స్థానిక అవసరాల కోసం డబ్బులు చెల్లించొచ్చని పేటీఎం తెలిపింది. ప్రస్తుతానికి డీఫాల్ట్ గా డిసెబుల్ చేసిన ఈ ఫీచర్ ను వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడానికి వన్ టైం యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా స్పందించిన పేటీఎం... రాబోయే సెలవుల దృష్ట్యా ఈ ఫీచర్ వినియోగదారుల విదేశీ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొంది. అయితే... ట్రిప్ వ్యవధిని బట్టి 1 నుంచి 90 రోజుల వినియోగ వ్యవధిని వినియోగదారులు ఎంచుకోవాలి. భద్రతా ప్రయోజనాల దృష్ట్యా తర్వాత దీన్ని ఈ విదేశీ పేమెంట్స్ ని మూసేస్తారు.

ఏది ఏమైనా... పైన చెప్పిన దేశాలకు టూర్ కు వెళ్దామనుకునేవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని మాత్రం చెప్పొచ్చు. పేటీఎం ద్వారా ఈజీ పేమెంట్స్ చేయవచ్చు

Tags:    

Similar News