Begin typing your search above and press return to search.

అమ్మో శుక్రవారం...పయ్యావుల చెప్పిన ఫోన్ల కధ !

ఇపుడు చూస్తే ఆర్ధిక మంత్రిగా వచ్చిన పయ్యావుల కేశవ్ కి సరికొత్త అనుభవాలు ఎదురవుతున్నాయట. ఏపీలో అప్పులు ఎంత ఉన్నాయి అంటే 14 లక్షల కోట్లు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:50 PM GMT
అమ్మో శుక్రవారం...పయ్యావుల చెప్పిన ఫోన్ల కధ !
X

అమ్మో ఒకటో తారీఖు అన్నది మధ్యతరగతికి ఉన్న భారం. ఒకటో తారీఖు వచ్చిందంటే లెక్కలేని ఖర్చులు అప్పులు వేటికి సర్దాలో జీతం నుంచి వేటికి కేటాయించాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అదే రకమైన పరిస్థితి రాష్ట్రానికి ఆర్ధిక మంత్రిగా పనిచేసిన వారికీ ఉంటుంది.

ఇక అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఏపీ లాంటి స్టేట్ కి ఆర్ధిక మంత్రి అయ్యారు అంటే వారికి ప్రతీ రోజూ నిద్ర లేని రాత్రులే. గతంలో వైసీపీ హయాంలో అయిదేళ్ల పాటు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన బుగ్గర రాజేంద్రనాధ్ ని అంతా అప్పులు మంత్రి అని సెటైర్లు వేసేవారు. ఆయన హయాంలో అప్పులు అంతగా తెచ్చేవారు అని విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చేవి.

ఇపుడు చూస్తే ఆర్ధిక మంత్రిగా వచ్చిన పయ్యావుల కేశవ్ కి సరికొత్త అనుభవాలు ఎదురవుతున్నాయట. ఏపీలో అప్పులు ఎంత ఉన్నాయి అంటే 14 లక్షల కోట్లు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా చెప్పింది 10 లక్షల కోట్లు మాత్రమే అని ఆ మీదట ఆరు లక్షల కోట్లు అని చెప్పారు.

ఇక వైసీపీ అయితే మొత్తం అప్పులు ఆరున్నర లక్షల కోట్లు అని ఇందులో 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లు అయితే మిగిలిన మూడు లక్షల కోట్ల రూపాయలు తన వాటా అని చెప్పుకుంటోంది. తాము తెచ్చిన ఆ మూడు లక్షల కోట్ల రూపాయలతో ఏపీలో ఎన్నో పధకాలను అమలు చేశామని వైసీపీ నేతలు చెప్పుకున్నారు.

అయిఏ ఏపీకి ఇంతలా అప్పులు పెరిగిపోవడానికి వైసీపీ మాత్రమే కారణం కాదని ఆనాడు కేంద్రం కూడా ఉదారంగా అప్పులు చేసుకునే వెసులుబాటు ఇచ్చిందని విమర్శలు ఉన్నాయి. కేంద్రం రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వాలి. కానీ అప్పులకు అనుమతులు ఇస్తూ ఒక్క ఏపీ మాత్రమే కాదు దేశంలోని చాలా రాష్ట్రాలు అప్పులు చేసుకునేలా చేసి అప్పుల బెడత ఎక్కువ అయ్యేలా చేయడానికి కేంద్ర ఆర్థిక విధానాలు కారణం అని ఆర్ధిక నిపుణులు అంటూ ఉంటారు అది ఒక డిఫరెంట్ స్టోరీ అనుకున్నా ఇపుడు ఏపీలో అప్పులు మాత్రం ఆర్ధిక మంత్రి పయ్యావులను చుట్టు ముడుతున్నాయి.

ఎందుకంటే ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నారు కాబట్టి. ఆయన బాధ్యత వహిస్తున్నారు కాబట్టి గతంలో వైసీపీ హయాంలో వివిధ రాకలైన వడ్డీలతో చేసిన అప్పులను తీర్చమంటూ ప్రతీ శుక్రవారం వెల్లువలా ఫోన్లు వస్తున్నాయట అసలే ఏపీలో ఖజానా వట్టి పోయి ఇబ్బందులు పడుతోంది. ఏ పధకం అయినా అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు అయితే లేవు. దాంతో ప్రభుత్వ కార్యక్రమాలకు ఓవర్ డ్రాఫ్టులతో కాలక్షేపం చేస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో చేసిన అప్పుల మీద వడ్డీలు ప్రతీ నెలా చివరి శుక్రవారం కట్టాల్సి వస్తోంది. ఆ భారం ఇపుడు కూటమి ప్రభుత్వం మీద పడుతోంది. దాంతో నేరుగా ఆర్ధిక మంత్రికి ప్రతీ నెలా చివరి శుక్రవారం వడ్డీలు చెల్లించమంటూ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట.

ఈ ఫోన్ల తాకిడిని తట్టుకోలేక ఆయన తన ఇంట్లో ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నా ఆఫీసుకు ఫోన్లు వచ్చి విసిగిస్తున్నాయట. ఇలా ప్రతీ నెలా ఆఖరు శుక్రవారం వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి వరకూ ఫోన్ల మీద ఫోన్లతో ఆర్ధిక మంత్రి బెంబేలెత్తున్నారుట. ఈ విషయం ఆయన స్వయంగా చెప్పేంతవరకూ ఎవరికీ తెలియదు.

దాంతో పాపం ఆర్ధిక మంత్రి అని అంతా అనుకుంటున్నారు. ఏపీ అప్పులతో ఇప్పటికే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఆఖరుకు పెన్నూ పెన్సిల్ కొనుగోలు చేఅయలనుకున్నా ఎన్నో లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. మరి ఈ అప్పులకు తోడు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టమంటూ ఫోన్ల ద్వారా తాఖీదులతో ఆర్ధిక మంత్రి ఇబ్బంది పడుతున్నారుట. మొత్తానికి అమ్మో శుక్రవారం అని ఆయన అనుకునే పరిస్థితి ఉంది అని అంటున్నారు.