రాష్ట్రంలో తిరిగే హక్కు జగన్‌కు లేదు: కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్‌

ఇదేస‌మ‌యంలో గ‌త జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన హ‌త్య‌ల‌ను కూడా.. పెమ్మ‌సాని ఏక‌రువు పెట్టారు.

Update: 2024-07-20 10:01 GMT

కేంద్ర మంత్రి, గుంటూరు పార్ల‌మెంటు స‌భ్యుడు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ కు అస‌లు రాష్ట్రంలో తిరిగే హ‌క్కు కూడా లేద‌న్నారు. తాజాగా వినుకొం డలో జ‌రిగిన హ‌త్య వ్య‌వ‌హారంపై అక్క‌డ ప‌ర్య‌టించి.. కూట‌మి స‌ర్కారుపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌ను ఉద్దేశించి పెమ్మ‌సాని రియాక్ట్ అయ్యారు. వినుకోండ లో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని విమ‌ర్శించారు.

ఇదేస‌మ‌యంలో గ‌త జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన హ‌త్య‌ల‌ను కూడా.. పెమ్మ‌సాని ఏక‌రువు పెట్టారు. 2019-24 మ‌ధ్య కాలంలో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత‌ చంద్రయ్య హాత్య జరిగినపుడు ఎందుకు పరామ ర్శించలేదని ప్ర‌శ్నించారు. హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించింది జ‌గ‌న్ కాదా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని.. ప్ర‌జ‌లు అందుకే ఆయ‌న‌ను తిప్పికొట్టార‌ని.. చేసుకున్న పాపం ఊరికే పోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఢిల్లీలో ఈ నెల 24న ధ‌ర్నా చేస్తాన‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను కూడా.. పెమ్మ‌సాని తిప్పికొట్టారు. జగన్ ఢిల్లీలో కాదు గల్లీలో చేసిన అవినీతి బాగోతం అందరికీ తెలుసన‌ని.. దానిపై కూడా.. ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే బాగుంటుంద‌న్నారు. జగన్ హత్యా రాజకీయాలును ప్రోత్సహించారు కాబ‌ట్టే.. ఇప్పుడు అదే ప‌రిస్థితి వైసీపీకి ఎదురైంద‌ని.. వారి ద్ద‌రూ.. వైసీపీకి చెందిన నాయ‌కులేన‌ని పెమ్మ‌సాని వ్యాఖ్యానించారు. గ‌డిచిన ఐదేళ్ల పాటు.. ఏపిని అధోగతిపాలు చేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. ఓర్చుకోలేక పోతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ జిమిక్కులు చేస్తున్నారని పెమ్మ‌సాని మండిప‌డ్డారు. జ‌గ‌న్ ఎన్ని కుట్ర‌లు చేసినా.. కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అభివృద్ధి బాట‌లో న‌డిపించేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇప్ప‌టికైనా గ‌త పాపాలు క‌డుక్కుకునేందుకు ప్ర‌జ‌ల‌ను క్ష‌మాప‌ణ‌లు కోరాల‌ని.. ఢిల్లీలో ధ‌ర్నా వంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. లేక‌పోతే.. కూట‌మి ప్ర‌భుత్వం త‌గిన విధంగా బుద్ధి చెబుతుంద‌న్నారు.

Tags:    

Similar News