ఉచిత ఇసుక... ఆదిలోనే హంస పాదు!

ఇసుక విధానాన్ని మార్పులు చేసిన సీఎం చంద్ర‌బాబు.. అంద‌రికీ ఉచితంగానే దీనిని అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Update: 2024-10-07 22:30 GMT

ఇసుక విధానాన్ని మార్పులు చేసిన సీఎం చంద్ర‌బాబు.. అంద‌రికీ ఉచితంగానే దీనిని అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనివ‌ల్ల భ‌వ‌న నిర్మాణ రంగం పెద్ద ఎత్తున పుంజుకుంటుంద‌ని కూడా చెప్పుకొచ్చారు. గ‌తంలో వైసీపీ చేసిన త‌ప్పుడు ప‌నుల కార‌ణంగా ఇసుక విధానం లోప‌భూయిష్టంగా మారి.. అప్ప‌టి అధికార పార్టీ నాయ‌కులు దోచుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డేలా చేసింద‌ని కూడా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ఉచిత ఇసుక‌పై ప్ర‌జ‌లు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు.

ఈ విధానం అమ‌ల్లోకి వ‌చ్చి రెండో నెల వ‌చ్చేసినా.. దీనిపై ఇంకా విమ‌ర్శ‌లు, వ్య‌తిరేక‌త వ‌స్తూనే ఉంది. వైసీపీ హ‌యాంలో కంటే ఇప్పుడే ఇసుక రేట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీనికి తోడు.. ఇసుక బుక్ చేసుకునేందుకు గ‌తంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు ఇసుక‌ను బుక్ చేసే క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ఇబ్బందులు వ‌స్తున్నాయి. క‌నీసం డిగ్రీ చ‌ద‌వి ఉంటే త‌ప్ప‌.. ఇసుక‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

లాగిన్ ద‌గ్గ‌ర నుంచి ఇసుక‌ను బుక్ చేసుకునే వ‌ర‌కు కూడా సామాన్యులు అగ‌చాట్లు ప‌డుతున్నారు. నిజానికి ఇసుక విధానంలో ద‌ళారుల ప్ర‌మేయాన్ని లేకుండా చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఇసుక‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని కూడా తెలిపారు. కానీ, వాస్త‌వం ఏంటంటే.. ఇసుక కోసం ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలంటే.. ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా గ్రామీణ, న‌గ‌ర, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా.. ఇసుక‌ను బుక్ చేసుకునే విధానంపై సామాన్యుల‌కు అవ‌గాహ‌న లేకుండా పోయింది.

విధానం కూడా క‌ష్ట‌త‌రంగానే ఉంది. ఫోన్‌కు ఓటీపీ మాత్ర‌మే కాదు.. త‌ర్వాత‌.. పాస్ వ‌ర్డ్ మార్చుకోవ‌డం.. ఇసుక‌ను బుక్ చేసుకోవ‌డం వంటి లెంగ్తీ ప్రాసెస్ అయిపోయాయి. అంతేకాదు.. అందులో ఉన్న ఇంగ్లీష్‌ను అర్ధం చేసుకుని.. బుక్ చేసుకోవ‌డం సామాన్యుల‌కు క‌ష్ట‌సాధ్యంగా కూడా మారింది. దీంతో స‌హ‌జంగానే బుక్ చేసేందుకు ద‌ళారులు రెడీగా ఉంటున్నారు. ఇక్క‌డ కూడా చిత్రం ఏంటంటే.. ట‌న్ను ఇసుక‌ను బుక్ చేసేందుకు రూ.50 చొప్పున వ‌సూలు చేస్తున్నారు.

ప‌ది ట‌న్నుల ఇసుకను బుక్ చేయాలంటే.. సామాన్యులు రూ.500 ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. ఇక‌, ఆత ర్వాత‌.. ఉండే తిప్ప‌లు వేరేగా ఉన్నాయి. ఎలా చూసుకున్నా.. ఉచిత ఇసుక‌ను ప్ర‌క‌టించిన స‌ర్కారు.. దీనిలోని మంచి చెడుల‌ను వ‌దిలేయ‌డం.. సామాన్యుల కేంద్రంగా ఈ విధానాన్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

Tags:    

Similar News