సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చొద్దు.. పిటిషనర్ వాదన ఇదే

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భవనం కోసం ఒక పిటిషన్ దాఖలైంది.

Update: 2024-05-29 05:20 GMT
సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చొద్దు.. పిటిషనర్ వాదన ఇదే
  • whatsapp icon

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భవనం కోసం ఒక పిటిషన్ దాఖలైంది. ఇప్పుడున్న భవనాన్ని కూల్చేసి.. కొత్త భవనాన్ని నిర్మించాలని.. భారీ కట్టడాన్ని కూల్చే బదులు కొత్తగా కట్టిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తన వాదనగా తెర మీదకు తీసుకొచ్చాడు. ఈ వాదనకు మద్దతుగా కేంద్రం ప్రభుత్వంతో పాటు.. కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న భవనాన్ని వేరే అవసరాలకు వాడుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వైనానికి సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది ప్రశ్నగా మారింది.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం పదిహేడు కోర్టు రూమ్ లు.. రెండు రిజిస్ట్రీ రూంలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మొత్తం భవనాన్ని కూల్చేసి రూ.800 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. కొత్తగా కట్టే భవనంలో మొత్తం 27కోర్టు రూంలు.. నాలుగు రిజిస్ట్రీ రూమ్ లు నిర్మించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే.. దీనిపైనా సదరు పిటీషనర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. రానున్న రోజుల్లో సుప్రీంలో వేసే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని.. పదేళ్ల తర్వాత ఈ భవనాలు కూడా సరిపోవని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చేయొద్దంటూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి కేకే రమేశ్. ఆయన సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చొద్దని పోరాటం షురూ చేశారు. దీనికికారణం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాల్లో సుప్రీంకోర్టు భవనం ఒకటని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చేస్తే.. దేశ చరిత్రలోని ఒక భాగాన్ని నాశనం చేసినట్లేనన్నది ఆయన వాదన.

కొత్త భవనానికి సంబంధించిన నమూనాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదని.. ప్రజలతో పాటు బార్ అసోసియేషన్ తోనూ దీనిపై చర్చ జరగలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రైవేటు ప్రాంతాల్లో అనేక కోర్టులు.. ట్రైబ్యునళ్లు.. ప్రభుత్వ కార్యాలయాలకు ఇక్కడ వసతి కల్పించాలే కానీ.. కూల్చేయటం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News