పిఠాపురం ఎమ్మెల్యే గారి ప్రొగ్రెస్ రిపోర్టు ఇదే !
పవన్ ఎమ్మెల్యే అయ్యాక పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని నేమ్ ప్లేట్స్ తగిలించుకుని పవన్ అభిమానులు అంతా తెగ తిరిగారు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత పిఠాపురంలో పర్యటిస్తూ రూల్స్ ని ఎవరూ బ్రేక్ చేయవద్దని చెప్పిన తరువాత ఆ నేమ్ ప్లేట్స్ ని తీసేశారు. అయితే అంత గొప్పగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జనాలు చెప్పుకున్నాక ఆరేడు నెలలలో పవన్ పిఠాపురానికి ఏమి చేశారు అన్న చర్చ వస్తుంది.
పైగా ఆయన పూర్తి అధికారాలు కలిగిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో పిఠాపురం ప్రొగ్రెస్ రిపోర్ట్ ఏంటి అంటే దాని గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా తాను ఎమ్మెల్యేగా ఏమి చేశాను అన్న దానిని నూతన సంవత్సరం వేళ రిలీజ్ చేశారు. దాని ప్రకారం చూస్తే కేవలం ఏడు నెలల కాలంలో చాలానే చేశారు అని అంటున్నారు పవన్ విడుదల చేసిన సమగ్ర అభివృద్ధి నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించారు.
పవన్ ఎమ్మెల్యే అయ్యాక పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ముప్పై పడకల ఆసుపతిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లుగా పవన్ వెల్లడించారు. దీని కోసం 39.75 లక్షల కోట్లతో ఖర్చు చేయడానికి ఆమోదం కూడా లభించింది అని వివరించారు.
అంతే కాదు రెండు కోట్ల ఖర్చుతో నిర్మించతలపెట్టిన టీటీడీ కళ్యాణ మండపం కూడా పిఠాపురానికి రానుంది. 72 లక్షల రూపాయల ఖర్చుతో మోటార్లు పైప్ లైన్ల రిపేర్లు చేయించడం ద్వారా గొల్లప్రోలులో ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నామని పవన్ చెప్పారు.
తన నియోజకవర్గం పరిధిలోని 32 పాఠశాలకు క్రీడా సామగ్రి కిట్లను అందించామని అలాగే ప్రజలకు మంచి వైద్యం కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సిబ్బందిని నియమించామని తెలిపారు. గొల్లప్రోలులో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కనుగొంటున్నామని అదే విధంగా గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచి రోడ్డు కోసం నిధులు మంజూరు చేసి మరీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు లక్షల రూపాయలతో నూతన ఆర్ఓ ప్లాంట్, గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో ఒక లక్షా 75 వేల రూపాయలతో పెండింగ్ పనులు చేపట్టామని వివరించారు
ఇక చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో రెండు లక్షల నిధులతో ఆరో ప్లాంటు ఏర్పాటు చేసినట్లుగా కూడా పవన్ స్పష్టం చేశారు. కేవలం ఆరేడు నెలల వ్యవధిలో ఈ పనులు చేపట్టామని రానున్న రోజులలో మరింగగా అభివృద్ధి పనులు చేపడతామని పవన్ చెప్పారు. పారదర్శకత ఉండాలని తాను ఈ వివరాలు వెల్లడిస్తున్నాను అని ఆయన తెలిపారు. మొత్తానికి పిఠాపురం ఎమ్మెల్యే గారి ప్రొగ్రెస్ రిపోర్ట్ బాగానే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ఇదే తీరున మిగిలిన వారు కూడా తాము చేపట్టిన పనుల గురించి తెలియచేస్తే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది అని అంటున్నారు.