150 ఏళ్ల నాటి బ్రిటీష్ చట్టం.. ఖాన్ మార్కెట్ గ్యాంగ్ పై మోడీ ఫైర్!
బ్రిటీష్ కాలం నాటి కొన్ని చట్టాలను గుర్తు చేస్తూ "లుటియన్స్", "ఖాన్ మార్కెట్ గ్యాంగ్" లపై ప్రధాని విమర్శలు చేశారు.
బ్రిటిష్ కాలం నాటి కొన్ని చట్టాలపై మోడీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. లుటియన్స్ జమాత్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ లపై ఘాటు విమర్శలు చేశారు. దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్.ఎక్స్.టీ. కాన్ క్లేవ్ లో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ... 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... బ్రిటీష్ కాలం నాటి కొన్ని చట్టాలను గుర్తు చేస్తూ "లుటియన్స్", "ఖాన్ మార్కెట్ గ్యాంగ్" లపై ప్రధాని విమర్శలు చేశారు. వివాహంలో 10 మంది కలిసి డ్యాన్స్ చేస్తే పోలీసులు వరుడిని, డ్యాన్స్ చేసినవారి కూడా అరెస్ట్ చేయగల చట్టం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 74 ఏళ్ల పాటు కొనసాగిందని.. ఆ చట్టాన్ని బీజేపీ సర్కార్ రద్దు చేసిందని తెలిపారు.
ఈ విషయంపై "లుటియన్స్", "ఖాన్ మార్కెట్ గ్యాంగ్" లు మౌనంగా ఉండటంపై ప్రధాని విమర్శలు గుప్పించారు. 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని.. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అది 75 సంవత్సరాల పాటు కొనసాగిందని ప్రధాని ఎత్తి చూపారు. దాన్ని తమ ప్రభుత్వమే రద్దు చేసిందని వెల్లడించారు.
బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఈ డ్రామటిక్ పెర్ఫార్మెన్స్ యాక్ట్ చట్టం 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఉందని.. అంటే, పెళ్లి సమయంలో 10 కంటే ఎక్కువ మంది డ్యాన్స్ చేస్తుంటే.. పోలీసులు వారిని, వరుడిని కూడా అరెస్ట్ చేయవచ్చని.. తమ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని అన్నారు.
ఒకవేళ తానే అలాంటి చట్టం తీసుకొచ్చి ఉంటే.. అదే వ్యక్తులు తన జుట్టు పేకేసేవారని పేర్కొన్నారు! ఇదే సమయంలో.. ఒక దశాబ్ధంలోనే కేంద్ర ప్రభుత్వం సుమారు 1,500 చట్టాలను రద్దు చేసిందని.. వాటిలో చాలా వరకూ బ్రిటీష్ కాలం నాటివేనని అన్నారు.
ఇక.. ఇన్నేళ్లు శామిక శక్తిగా పేరుపోందిన భారత్.. ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మార్పు చెందిందని మోడీ అన్నారు. సెమీకండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ వంటి వాటిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఫలితంగా, ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా మారిందని పేర్కొన్నారు.