'పుష్ప-2' తరహాలోనే తెలంగాణ సీఎంను దించబోతున్నారా..?
ఈ సమయంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
'పుష్ప-2' సినిమాలో తాను ఫోటో దిగడానికి అంగీకరించలేదనే కారణంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చేస్తాడు పుష్పరాజ్. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేసి డబ్బులు సంపాదిస్తాడు.. ఫైనల్ గా సీఎం పీఠాన్ని కదిలించి, తనకు నచ్చిన వ్యక్తికి ఆ కుర్చీ ఎక్కిస్తాడు. అయితే... తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిపై అలాంటి ప్లానే నడుస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ లాయర్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి.
అవును.. తాజాగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని.. హీరో అల్లు అర్జున్ వెనుక ఓ మహా శక్తి ఉందని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టును కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని.. పుష్ప సినిమాలో చేసినట్లుగా రేవంత్ సర్కార్ ను కూల్చాలని చూస్తున్నారని అన్నారు.
ఇందులో భాగంగా... గడిచిన 48 గంటలుగా ఈ వ్యవహారంపై పెద్ద కుట్ర జరుగుతుందని, అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉందని, రేపటి నుంచి వారం రోజుల్లో రేవంత్ సర్కార్ ను కూల్చడానికి ప్లాన్ చేశారని.. ఈ వారం రోజుల్లోనే బీఆరెస్స్, బీజేపీ లు తాము అనుకున్న పనిని చేయాలనుకుంటున్నాయని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
ఇదే సమయంలో అల్లు అరవింద్ ఫ్యామిలీని కాపాడటానికి ప్రతిపక్షాలూ ఉన్నాయని.. కాని, బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది మాత్రం తెలంగాణ సమాజమేనని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సమయంలో.. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిలిగిపోతారని.. బాధితులకు అండిగా నిలిచివారే నిజమైన తెలంగాణ వాదులని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతు.. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యి, జైలుకు వెళ్లి వచ్చారని.. ఆయనకు బెయిల్ కొద్ది రోజులకు మాత్రమే వచ్చిందని.. అది కూడా మరో రెండు మూడు రోజుల్లో రద్దు అవుతుందని.. అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయమని అడ్వకేట్ తెలిపారు!