వెళ్లాను.. వెళ్లలేదు అన్న నందిగం చివరకు పోలీసుల విచారణలో ఏం చెప్పారంటే?
ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం పొంతన లేని సమాధానాలు చెప్పటం తెలిసిందే.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై వైసీపీకి చెందిన నేతలు కొందరు.. అల్లరిమూకలు కలిసి దాడి చేయటమే కాదు.. తీవ్ర విధ్వంసాన్ని క్రియేట్ చేసిన వైనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ఈ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బయటకు తీయటం.. ఈ కేసు విచారణను వేగంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయన్ను కోర్టు నుంచి తీసుకున్న అనుమతితో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం పొంతన లేని సమాధానాలు చెప్పటం తెలిసిందే. దాడి జరిగిన రోజున మంగళగిరిలోని వైసీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకు.. ఒకసారి వెళ్లలేదని.. మరోసారి అటు వైపు మాత్రమే వెళ్లినట్లుగా చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి ముందు వైసీపీ హెడ్డాఫీసులోనే ఉన్నారన్న ప్రశ్నకు ఆయన నో చెప్పారు. అయితే.. విచారణ అధికారులు మాత్రం దాడి వేళలో ఆయన వైసీపీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేసే సాంకేతిక ఆధారాల్ని నందిగం సురేశ్ కు చూపించినట్లుగా చెబుతున్నారు.
పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక ఆధారాల్ని చూసిన తర్వాత ఆయన తీరులో మార్పు వచ్చిందని చెబుతున్నారు. విచారణ గడువులో ఆయన తాను వైసీపీ కార్యాలయానికి వెళ్లిన వైనాన్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రెస్ మీట్ ఉందని చెబితే తాను పార్టీప్రధాన కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ ప్రధాన కార్యాలయంవైపు వచ్చినట్లుగా ఒప్పుకున్నారు. రెండు రోజుల విచారణలో మొత్తం 45 ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వీటిల్లో చాలా వరకు సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దాడి జరిగిన రోజున వైసీపీ కార్యాలయానికి వెళ్లారా? అన్న ప్రశ్నకు.. అటు తిరిగి ఇటు తిరిగిన ఆయన.. చివరకు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. అయితే.. కేసుకుకు అవసరమైన కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమాధానాలు సరిపోతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు అనుమతిచ్చిన రెండు రోజుల విచారణ పూర్తి కావటంతో కోర్టు ఎదుట హాజరుపర్చారు. దీనికి ముందు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేపట్టారు. న్యాయమూర్తి ముందు ప్రవేవ పెట్టగా.. విచారణ వేళలో ఏమైనా కష్టపెట్టారా? సవ్యంగానే జరిగిందా? అన్న ప్రశ్నలకు అతా బాగానే ఉందని చెప్పారు. దీంతో..ఆయన్ను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. మొత్తంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద జరిగిన కీలక దాడికి సంబంధించి.. నందిగం సురేశ్ ఇచ్చిన సమాచారంతో మరింత దూకుడుగా విచారణ సాగించే వీలుందన్న మాట వినిపిస్తోంది.