ఢిల్లీ డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా.. మళ్లీ వెలుగులోకి వచ్చిన వీరేంద్ర..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తుషార్ కోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
మనదేశంలో డ్రగ్స్ ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టుబడిన కొన్ని వేల కోట్ల రూపాయల విలువచేసే కొకైన్ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా ఉన్నట్టు టాక్. దర్యాప్తులో దుబాయ్ లో ఉంటున్న వీరేంద్ర బసొయా ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తుషార్ కోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసు విషయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదో నిందితుడైన జితేంద్ర పాల్ సింగ్ యూకే కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో గురువారం అమృత్సర్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జెస్సీ గత 15 సంవత్సరాలుగా యూకే లో నివాసం ఉంటున్నాడు. అయితే తాజాగా భారత్ లోని డ్రగ్స్ బిజినెస్ కోసం అతను పంజాబ్ కు వచ్చాడు.
ఢిల్లీలో డ్రగ్స్ కేసు విషయంలో జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో భయపడిన జెస్సి యూకే కి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు అతను దొరికిపోయాడు. ఇటీవల పట్టుబడిన నిందితులను పోలీసులు గట్టిగానే విచారించారు.. వారి విచారణలో దుబాయిలో ఉన్న వీరేంద్ర హిస్టరీ బయటపడింది. అంతేకాదు గత సంవత్సరం పూనేలో మూడు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో కూడా వీరేంద్ర హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కానీ తీరా పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి ఢిల్లీ, పిలాంజిలోని అతని ఇంటిపై దాడి చేసేటప్పటికి అతడు పారిపోయాడు. గతంలో వీరేంద్ర కొడుకుని కూడా పోలీసులు డ్రగ్స్ కేస్ విషయంలో అరెస్టు చేశారు. అయితే వెంటనే అతను పేల్ పై బయటకు కూడా రావడం జరిగింది. గత ఏడాది వీరేంద్ర కొడుకు పెళ్లి యూపీ కి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూతురుతో జరిగింది.
ఇక ఢిల్లీలో లాభం లేదు అని ఫిక్సయిన వీరేంద్ర ముఖం దుబాయ్ కి మార్చి అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ తో కలిసి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రతి కొకైన్ కన్సైన్మెంట్ కు మూడు కోట్ల రూపాయల చొప్పున ఇస్తాను అని తుషార్ గోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.