'నినాదాలు' కావలెను.. కూటమి, వైసీపీ పోటా పోటీ.. !
రాజకీయాల్లో నాయకులు ఎంత బలంగా ఉన్నా.. నినాదాలు వారికంటే బలంగా ప్రజల్లోకి వెళ్తాయి.
రాజకీయాల్లో నాయకులు ఎంత బలంగా ఉన్నా.. నినాదాలు వారికంటే బలంగా ప్రజల్లోకి వెళ్తాయి. 2019 ఎన్నికల్లో `కావాలి జగన్-రావాలి జగన్` అనే నినాదం.. దుమ్మురేపింది. సామాన్యుల నుంచి ఐటీ ప్రాఫె షనల్స్ వరకు.. ఈ నినాదం మార్మోగింది. వ్యవసాయ పనులు చేసుకునే కూలీల నోట్లో అయితే.. నిరం తరం వినిపించింది. ఆతర్వాత.. 2024లో టీడీపీ నినాదాలు కూడా ఇలానే ప్రజలను ఆకట్టుకున్నాయి. సూపర్ సిక్స్ జపం ఎక్కువగా వినిపించింది.
ఇక, ఇప్పుడు విషయానికి వస్తే.. రెండు పార్టీలకు కూడా.. నినాదాలు కరువయ్యాయి. ప్రభుత్వం తరఫున టీడీపీ చేసింది చెప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ, మాస్‌లోకి వెళ్లలేకపోతున్నాయి. పీ-4 నినాదం.. విజన్-2047, వికసిత ఏపీ వంటి నినాదాలు ప్రచారం చేయాలని అనుకున్నా.. అవి ప్రజలను ఆకట్టుకుంటే.. బీజేపీకి మేలు చేసినట్టే అవుతుందన్నది తమ్ముళ్ల లెక్క. చంద్రబాబు ఎలా ఆలోచించినా.. క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు మాత్రం ఆ నినాదాలను బీజేపీకి చెందినవిగానే చూస్తున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. మాట తప్పడు-మడమ తిప్పడు, మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాలు ఉన్నా.. అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. పైగా ఎదురు తన్నాయి. ఈ పరిణామాలతో అటు టీడీపీ, ఇటు .. వైసీపీలు ఇప్పుడు కొత్త నినాదాల వేటలో పడ్డాయి. కూటమి సర్కారు.. తరఫున సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు..చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరు మాసాల పాలన అనంతరం.. తగిన విధంగా జోష్ రాలేదన్నది ఆయన భావన. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై నినాదాలు ఇవ్వాలంటూ.. మంత్రులకు సూచించారు.
ఇక, వైసీపీ కూడా.. ఇదే నినాదాల వేటలో పడింది. గతం మరిచిపోయి.. కొత్త రూటులో ప్రయాణాలు ప్రా రంభించాలని జగన్ చెప్పారు. ఇది పార్టీలో ఉన్న నాయకులు అందరికీ వర్తిస్తుందని తెలిపారు. ప్రజల్లోకి ఎఫెక్టివ్‌గా వెళ్లాలనే ఉద్దేశంతో నాయకులు ఉన్న విషయం తనకు తెలుసనని.. దీనికి సంబంధించి స్లోగన్లు కూడా.. రూపొందించాలని ఆయన సూచించారు. ``గత నినాదాలు పట్టుకుని ఇంకా కూర్చోలేం. ఇప్పుడు కొత్తవి కావాలి`` అని జగన్ చెప్పుకు రావడం గమనార్హం. సో.. మున్ముందు.. ఈ రెండు పార్టీల్లోనూ.. నినాదల కోసం ప్రయత్నాలు ముమ్మరం కానున్నాయి.