మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక, ఫలితం వెల్లడించేందుకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక, ఫలితం వెల్లడించేందుకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఇంతలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎలాంటి మెజారిటీ వస్తుంది? ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? అనే విషయాలు కీలకంగా మారాయి. ఈ విషయంపై అనేక సర్వేలు ఫలితాలు వెల్లడించాయి. తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పోలింగ్ ముగిసింది.
ప్రజలు వెలువరించిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లోకి ఎక్కేసింది. అయితే.. ఈ ప్రజాతీర్పుపై పార్టీల అంచనా లకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో తాజా సర్వే ప్రకారం.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేయడం ఖాయమని అంటున్నారు. వీటిలో ఒకటి ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రం కావడం గమనార్హం. ఇక, మిగిలిన మరో రాష్ట్రంలో బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్, కాంగ్రెస్ ఉన్న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానున్నాయి.
ఛత్తీస్‌గఢ్: ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సీఎం భూపేష్ భగేల్‌పై మహాదేవ బెట్టింగ్ యాప్ ఆరోపణలు వెల్లువెత్తాయి. 508 కోట్లను ఆయనకు లంచంగా ఇచ్చారని.. ప్రధాని మోడీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ.. ప్రజలు విశ్వసించలేదని తాజా ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. దీంతో ఇక్కడ స్వల్ప తేడాతో అయినా.. కాంగ్రెస్ విజయం దక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.
రాజస్థాన్: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొత్తం 200 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అంతర్గత పోరే.. పార్టీకి శాపంగా మారింది. సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలట్‌ల మధ్య వివాదం ఉంది. ఇది .. పార్టీని పుట్టి ముంచిందని అంటున్నారు. ఇక్కడ వచ్చని ఎగ్జిట్ సర్వేల ప్రకారం.. కాంగ్రెస్ పోయి.. బీజేపీ అధికారంలో రానుంది.
మధ్యప్రదేశ్: ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయితే.. ఈ దఫా ప్రజలు మార్పు కోరుకున్నారని.. సర్వేలు వెల్లడించాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి.
తెలంగాణ: హోరా హోరీ పోరు సాగిన తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగానే సర్వేలు వచ్చాయి. అయితే.. ఎన్నికల ఫలితంపై మాత్రం అధికార బీఆర్ ఎస్ ఆశలు నిండుగానే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మిజోరాం: ఈ సారి.. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో కాంగ్రెస జెండా ఎగురుతుందని సర్వేలు చెబుతున్నాయి. స్థానిక అధికార పార్టీ ఎంఎన్‌పీ తో కలిసి కాంగ్రెస్ కూటమి సర్కారు ఏర్పాటుచేయొచ్చని.. సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి మరో 48 గంటల నిరక్షణ తర్వాత కానీ.. ఏది నిజం అనేది తెలియదు!?