మోహన్ బాబుపై మంత్రి ఆగ్రహం... మేటర్ సీరియస్!
మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం మంగళవారం హైడ్రామాకు, తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ మనోజ్ ప్రవేశించగా.. అనంతరం చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు.
మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం మంగళవారం హైడ్రామాకు, తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ మనోజ్ ప్రవేశించగా.. అనంతరం చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. తనను బౌన్సర్లతో కొట్టించారని ఆరోపించారని అంటున్నారు.
ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు రెచ్చిపోయారు. కొందరు మీడియా ప్రతినిధులపై చేయిచేసుకున్నారు. ఈ దాడిలో కెమెరామెన్ లు కిందపడిపోగా.. టీవీ9 ప్రతినిధి దవడ ఎముక మూడు చోట్ల విరిగిందని తెలుస్తోంది. ఈ సమయంలో తెలంగాణ మంత్రి ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు.
అవును... మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీవీ9 ప్రతినిధిపై ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ దాడి విషయంలో చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
మీడియాపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదంటూ అద్దంకి దయాకర్ ఖండించారు. ఇదే సమయంలో.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
మరోపక్క మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మీడియా ప్రతినిధులు. ఈ సందర్భంగా ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాపై దాడిని సీరియాస్ గా తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో... మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్.118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇక.. మంగళవారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మోహన్ బాబు వెంట విష్ణు ఉన్నారు.