కొత్త కష్టాలు కొనితెచ్చుకున్న పూనమ్ పాండే..!

అవును... పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు ఫైజాన్ అన్సారీ!

Update: 2024-02-13 07:57 GMT

నటి పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ తో మరణించినట్లు సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఖాతా నుంచి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈమె మరణ వార్త ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఇక ఈ కేసులో రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ కోర్టుకెక్కారు. దీంతో... పూనమ్ పాండే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు ఫైజాన్ అన్సారీ! దీంతో... సీపీ అఖిల్ కుమార్ ఈ విషయం మీద విచారణకు ఆదేశించారు. దీంతో పాటు ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారని తెలుస్తుంది. దేశ ప్రజల మనోభావాలను పూనమ్ పాండే దెబ్బతీసిందని ఫైజాన్ అన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతుంది.

కాగా... అమెరికా ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్‌, భారతీయ అనుబంధ సంస్థ ఎం.ఎస్.డీతో కలిసి గతంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే.. సర్వైకల్ క్యాన్సర్ పై ప్రచార బాధ్యతను తీసుకుంది. ఆ క్రమంలోనే కాస్త క్రేజీగా ఆలోచించి తాను సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు పోస్ట్ పెట్టించింది పాండే! ఆ తర్వాత ఈ సంస్థ సర్వైకల్ క్యాన్సర్ అవేర్ వీడియోతో.. తాను బతికే ఉన్నాను అంటూ బయటికి వచ్చింది.

పూనమ్ చనిపోయిందని ఆమె అధికారిక ఇన్ స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఫైజాన్ అన్సారీ.. పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేశారు. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన ఈ సందర్భంగా స్పందించారు.

ఈ క్రమంలో... అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, పూనమ్ ఆమె భర్త.. నకిలీ మరణాన్ని ప్రకటించి కేవలం తమ ప్రచారం కోసం వాడుకున్నారని ఆరోపించాడు. ఇలా చేయడంవలన చాలామంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పారు. అందుకని వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.



Tags:    

Similar News