ఉరి వేసుకుంటానంటూ పోసాని హాటెస్ట్ స్టేట్మెంట్!

Posani Krishna Murali Sensational Comments

Update: 2024-11-12 18:25 GMT

సినీ రచయిత నటుడు రాజకీయ నాయకుడు అయిన పోసాని క్రిష్ణ మురళి తాజాగా హాటెస్ట్ కామెంట్స్ చేశారు. తాను లైవ్ లోనే ఉరి వేసుకుంటాను అని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇంత తీవ్ర స్థాయిలో ప్రకటన ఆయన ఎందుకు చేశారు అన్నది చూస్తే కనుక ఏపీలో వైసీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు.

తాను చంద్రబాబుతో లైవ్ డిబేట్ కి సిద్ధమని పోసాని ప్రకటించారు. తన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన జవాబులు చెబితే కనుక తాను లైవ్ లోనే ఉరి వేసుకుంటాను అని పోసాని సవాల్ చేశారు.

ఏపీలో అనేక హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందని పోసాని అన్నారు. వాటిని నెరవేర్చడం లేదని చెప్పారు. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని వైసీపీ ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత దేశంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందని పోసాని అన్నారు. కానీ ఏపీలో మాత్రం ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే పోసాని క్రిష్ణ మురళి మీద జనసేన నేతల ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీ పురంలో కేసు నమోదు అయింది. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నపుడు దారుణమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేశారని ఆ ఫిర్యాదులో జనసేన నేతలు పేర్కొన్నారు. దీంతో పోసాని మీద కూడా కేసు నమోదు అయినట్లు అయింది.

ఆయన వైసీపీకి జగన్ కి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ఆయన నేరుగా చంద్రబాబుని పవన్ ని అప్పట్లో విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం మీద ఎవరు ఏమన్నా ఆయన సహించేవారు కాదు. ఆ విధంగా ఆయన వైసీపీకి నిబద్ధతతో పనిచేశారు. అందుకు గానూ ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కూడా దక్కింది.

ఇక వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వరసబెట్టి చాలా మందిని కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అప్పట్లో పోస్టింగులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకోవాలని కూటమిలోని టీడీపీ జనసేన కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఆ వరసలో పోసాని మీద కూడా కేసు పెట్టారని అంటున్నారు.మరి దీని మీద పోసాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News