బాలయ్య కనిపించడం లేదు.. బోర్డులు పెట్టేశారుగా..!
సినీ రంగ అగ్ర కథానాయకుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ వ్యవహారం.. రసకందాయంలో పడిం ది. అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయంగా కూడా.. వరుస విజయాలు అందుకుంటున్న ఆయన.. విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.;

సినీ రంగ అగ్ర కథానాయకుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ వ్యవహారం.. రసకందాయంలో పడిం ది. అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయంగా కూడా.. వరుస విజయాలు అందుకుంటున్న ఆయన.. విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో బాలయ్య కనిపించడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత మూడు ఎన్నికల నుంచి ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకుంటున్నారు.
అయితే.. 2014-19 మధ్య సినిమాల కారణంగా కొంత బిజీ అయిన ఆయన ఓ పీఏకు నియోజకవర్గం బాధ్య తలు అప్పగించారు. ఇది అప్పట్లో వివాదానికి కారణమైంది. ప్రజలు పీఏపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు.. దాడికి కూడా దిగారు. దీంతో పీఏను పక్కన పెట్టారు. ఈక్రమంలో కొన్ని రోజులు బాలయ్య నియోజకవర్గంలోనే ఉండి కార్యక్రమాలు చేపట్టారు. ఇక, 2019-24 మధ్య కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా.. వైసీపీ హయాంలో వలంటీర్లు అందుబాటులో ఉండడంతో ఆయన పనికి ఇబ్బంది లేకుండా పోయింది.
హిందూపురం ప్రజలకు వైసీపీ హయాంలో వలంటీర్లు సాయం చేశారు. దీంతో ఎమ్మెల్యేలేని లోటు ఒకరకంగా తీరిపోయింది. అయితే.. సత్యసాయి జిల్లాకు హిందూపురం కేంద్రం చేయాలన్న డిమాండ్ మాత్రం వచ్చింది. ఆ సమయంలో ప్రజలతో కలిసి.. బాలయ్య ఉద్యమించారు. తమ ప్రభుత్వం వచ్చాక హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాకు శ్రీకారం చుడతామని చెప్పారు. దీంతో ప్రజలు ఆయనపై విశ్వాసం పెట్టుకున్నారు. కట్ చేస్తే.. మూడోసారి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు బాలయ్య.
కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్నది ఇక్కడి ప్రజలు చెబుతున్న మాట. పైగా తమడిమాండ్ నెరవేర్చలేదన్నదికూడా.. వినిపిస్తోంది. మరోవైపు.. అసలు బాలయ్య నియోజకవర్గానికి దూరంగా విదేశాల్లో షూటింగుల్లో ఉండడాన్ని ఎక్కువ మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలపైనే తాజగా టీడీపీ ఆఫీసులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
బాలయ్య కనిపించడం లేదు.. అంటూ.. కొందరు ఒకటి రెండు చోట్ల బ్యానర్లు కూడా కట్టారు. పూర్తిస్థాయిలో వ్యతిరేకత రాకపోయినా.. బాలయ్యపై కొంత వ్యతిరేకత అయితే.. కనిపిస్తుండడం గమనార్హం. ఆయన ఒక్కసారి అయినా నియోజకవర్గంలో పర్యటించి తమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడి వారు కోరుతున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.