జేసీ ప్రభాకర్ రెడ్డి - మాధవీలత ఇష్యూలో బిగ్ ట్విస్ట్!

డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై మాధవీలత కామెంట్స్ తో మొదలైన ఈ వ్యవహారం.. అనంతరం జేసీపీ రియాక్షన్ తో ఒక్కసారిగా వేడెక్కింది.

Update: 2025-02-25 05:25 GMT

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేత మాధవీలత ఇష్యూ ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై మాధవీలత కామెంట్స్ తో మొదలైన ఈ వ్యవహారం.. అనంతరం జేసీపీ రియాక్షన్ తో ఒక్కసారిగా వేడెక్కింది.

ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నిస్తూ.. అలాంటి వేడుకలకు వెళ్లొద్దని మాధవీలత సూచించారు! దీంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇందులో భాగంగ.. మాధవీలత కామెంట్స్ ని తప్పుబడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఊహించనిస్థాయిలో స్పందించారు!

ఈ క్రమంలో మాధవీలత కామెంట్స్ తప్పుబడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించారు. అలాగే, జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొచ్చారు.

దీంతో... మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ అనుచరులు తనను బెదిరిస్తున్నారని.. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో తాజాగా ఈ వ్యవహారంలో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది.

అవును... జేసీ ప్రభాకర్ రెడ్డి - మాధవీలత ఇష్యూలో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా.. తాడిపత్రిలో సినీనటి, బీజేపీ నేత మాధవీలతపై కేసు నమోదైంది. ఈ సందర్భంగా... తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాధవీలత మాట్లాడారంటూ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో.. తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆవేశంలో అలా జరిగిపోయింది. సారీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు! ఈ సమయంలో మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదవ్వడం గమనార్హం.

Tags:    

Similar News