పవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ "ఫుట్ బాల్" కామెంట్స్!
ఈ సమయంలో తాజాగా తమిళనాట ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇందులో భాగంగా పవన్ ని ఫుట్ బాల్ తో పోల్చారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ల మధ్య మొదలైన మాటల యుద్ధం... కంటిన్యూ అవుతూనే ఉంది! ఈ విషయంపై పవన్ కల్యాణ్ ను ప్రకాశ్ రాజ్ ఈ విషయంలో వెంటాడుతూనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. పవన్ ప్రతీ యాక్షన్ ను ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.
తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ 53వ వార్షికోత్సవం సందర్భంగా స్పందించిన పవన్... ఈ సందర్భంగా ఆ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ సందర్భంగా విప్లవ నాయకుడు ఎంజీఆర్ వారసత్వం, జయలలిత దూరదృష్టి గల నాయకత్వం తరతరాలుగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ ట్వీట్ పై స్పందించిన ప్రకాశ్ రాజ్... "ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందికింత ప్రేమో.. పైనుంచి ఆదేశాలు అందాయా.. జస్ట్ ఆస్కింగ్" అని ట్వీట్ చేశారు. అంతక ముందు "సనాతన ధర్మ రక్షణలో మీరుండండి.. సమాజ రక్షణలో మేముంటాం.. జస్ట్ ఆస్కింగ్.. ఆల్ ది బెస్ట్" అని రియాక్ట్ అయ్యారు.
ఈ విధంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తారతమ్యాలు లేకుండా పవన్ కల్యాణ్ పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకాశ్ రాజ్ స్పందిస్తూనే ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తాజాగా తమిళనాట ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇందులో భాగంగా పవన్ ని ఫుట్ బాల్ తో పోల్చారు.
అవును... తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ లమధ్య మొదలైన మాటల యుద్ధం అవిరామంగా కొనసాగుతున్నట్లుగా ఉంది! తాజాగా పవన్ కల్యాణ్ పై స్పందించిన ప్రకాశ్ రాజ్... రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఫుట్ బాల్ లాంటి వారని.. ఆయనను ఎవరైనా ఎలాగైనా ఉపయోగించుకుంటారని అన్నారు!
ఇదే సమయంలో పవన్ చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవని.. కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉందని.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... నటుడిగా వివిధ సినిమాలో వివిధ పాత్రలు పోషిస్తారు.. పాలిటిక్స్ అలా కాదు.. ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుంది అని ప్రకాశ్ రాజ్ హితవు పలికారు.