కేసీఆర్ పై న‌మ్మకం లే.. ప్ర‌కాష్ గౌడ్ ఔట్‌!

అయినా.. కేసీఆర్ ఎవ‌రినీ బ్ర‌తిమాల‌లేదు. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌నూ లేదు. పైగా..కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని చెబుతున్నారు

Update: 2024-04-19 12:30 GMT

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై న‌మ్మకం క‌ల‌డం లేదా? ఉన్న న‌మ్మ‌కం కూడా పోతోందా? నాయ‌కులు చేజారుతున్న లెక్క‌ను గ‌మ‌నిస్తే.. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ నేత‌లు. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు వెళ్లిపోయారు. వీరిలో సిట్టింగులు, ఫ‌ట్టింగులు కూడా ఉన్నారు. అయినా.. కేసీఆర్ ఎవ‌రినీ బ్ర‌తిమాల‌లేదు. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌నూ లేదు. పైగా..కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని చెబుతున్నారు.

ఇలాంటి వ్యాఖ్య‌ల‌తోనే కేసీఆర్ ఒకింత ప‌ల‌చ‌న‌వుతున్నార‌నిప‌రిశీల‌కులు చెబుత‌న్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ కూడా ఔట్ అయ్యే జాబితాలో చేరిపోయారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి రేవంత్‌ను క‌లిసి భ‌విష్య‌త్తుపై చ‌ర్చించారు. వ్యాపారం, వ్యవ‌హారం..రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు ప్ర‌కాష్ గౌడ్‌. ఈయ‌న‌ను చేర్చుకోవ‌డంద్వారా.. పార్టీలో ఊపు తీసుకురావాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ, ఇదేస‌మ‌యంలో ఈయ‌న‌ను కాపాడుకునేందుకు బీఆర్ ఎస్ మాత్రం.. ముందుచూపు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతోంది.

రాజేంద్ర‌న‌గ‌ర్ స‌హా చుట్టుప‌క్క‌ల ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోప్ర‌కాష్ గౌడ్‌కు మంచి పేరుంది.పైగా వ్య‌క్తిగ‌తంగా ఆయ‌నకు అనుచ‌ర గ‌ణం కూడా ఉంది. ఈ ప‌రిణామాలు ఆయ‌న‌కు క‌లిసివ‌స్తున్నాయి. ఇదే గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు వ్య‌తిరేకత ఉన్నా.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోఈయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు ఇలాంటి నాయ‌కుడు వెళ్లిపోతున్నా.. సీఎం రేవంత్‌తో భేటీఅవుతున్నార‌న్న స‌మ‌చారం ఉన్నా.. కేసీఆర్ మౌనంగా ఉండ‌డం.. త‌న‌కు కేసీఆర్‌పై న‌మ్మ‌కం లేద‌ని ఆఫ్ ది రికార్డుగా గౌడ్ వ్యాఖ్యానించ‌డం వంటివి బీఆర్ ఎస్‌లో నేత‌ల‌కు-అధినేత‌కు ఉన్న గ్యాప్‌ను స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News