పీకే మాస్టర్ ప్లాన్ : జగన్ కి పోటీగా లోకేష్...!

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాల పై మాట. 2024 ఎన్నికల నాటికి అక్షరాలా టీడీపీకి 42 ఏళ్ళ వయసు వస్తుంది

Update: 2023-12-28 03:52 GMT

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాల పై మాట. 2024 ఎన్నికల నాటికి అక్షరాలా టీడీపీకి 42 ఏళ్ళ వయసు వస్తుంది. అంటే ఆ పార్టీ ఒక విధంగా వృద్ధాప్యం చాయలతో నిండి ఉంది అని అంటున్నారు. టీడీపీ పలు మార్లు అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముమ్మారు సీఎం అయ్యారు. ఆయన 2024లో మరోమారు సీఎం క్యాండిడేట్ అంటే జనాలకు అంత ఊపు రాదని అంటున్నారు.

ఎందుకంటే చంద్రబాబు పాలనను జనాలు చూశారు అని అంటున్నారు. దాంతో టీడీపీ యువ నేతగా లోకేష్ ని ప్రమోట్ చేసే పనిలో పడింది అని అంటున్నారు. లోకేష్ వయసు 2024 ఎన్నికల నాటికి 41 ఏళ్ళు. అంటే రాజకీయంగా ఆయన నవ యవ్వనుడు అన్నమాట. జగన్ వయసు 51 ఏళ్ళు. జగన్ కి లోకేష్ మధ్య పదేళ్ళు వ్యత్యాసం ఉంది.

అలా యూత్ కి ఐకాన్ గా లోకేష్ ఉంటారు అని టీడీపీ ఊహిస్తోంది. అందుకే ఆయననే హైలెట్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది అని అంటున్నారు. యువగళం సభ ముగింపులో కూడా లోకేష్ నే ఫౌర్ ఫ్రంట్ లో పెట్టి అంతా మాట్లాడారు. టీడీపీలో నవ శకం అంటే అది లోకేష్ తోనే అని అంటున్నారు

ఇక టీడీపీకి చంద్రబాబు ఇప్పటిదాకా అధినాయకుడు. అయితే విధాన పరమైన నిర్ణయాలు ఇపుడు లోకేష్ కూడా తీసుకుంటున్నారు. వాటిని ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు టీడీపీ 150 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేస్తుందని లోకేష్ చెప్పారు. అలాగే జనసేనతో పొత్తు సందర్భంగా అధికారం షేరింగ్ ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో రెండవ మాట కూడా లేదని అన్నారు.

ఇది కూడా హాట్ టాపిక్ గా జనంలోకి వెళ్ళిపోయింది. మరో వైపు చూస్తే లోకేష్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న ఇంప్రెషన్ పార్టీ జనాలకు బయట జనాలకు కలిగిస్తున్నారు. ఇక పాదయాత్ర ముగిసిన తరువాత లోకేష్ జిల్లా టూర్లు కూడా పెట్టుకుంటున్నారు. సంక్రాంతి తరువాత లోకేష్ వివిధ జిల్లాలలో పర్యటిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలలో మాట్లాడుతారు.

అవన్నీ లోకేష్ సోలోగా నిర్వహించే సభలే. అంటే అటు జగన్ కి టీడీపీ నుంచి లోకేష్ కౌంటర్ గా ముందుకు వస్తారన్న మాట. వీటితో పాటుగా మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అదేంటి అంటే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా టీడీపీతో ఒప్పందం కుదుర్చుకుంది వ్యూహకర్తగా పనిచేయబోయేది కూడా లోకేష్ ని ఫ్యూచర్ సీఎం గా ప్రమోట్ చేసేందుకే అంటున్నారు

అంటే 2024 ఎన్నికల్లో జగన్ కి ధీటుగా పోటీగా లోకేష్ ని రెడీ చేసే పనిలో పీకే ఉన్నారన్న మాట. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీకి సొంతంగా మెజారిటీ దక్కితే మాత్రం లోకేష్ సీఎం గా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. దీని వెనక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ కూడా ఉంది అని అంటున్నారు. లోకేష్ ని ముందు పెట్టి యూత్ ఓట్లను టర్న్ చేసుకోవడం టీడీపీ ద్వారా కొత్త తరాన్ని ఆకట్టుకోవడం వంటివెన్నో ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News