ఇండియా కూటమి వైపుగా బాబుని నడిపిస్తున్న పీకే...!?

ఆ తరువాత బీజేపీ ఉంది. దాంతో కేసీయార్ న్యూట్రల్ గానే ఉంటారు. ఇక ఏపీలో చూస్తే జగన్ కి ఎన్డీయే ఒక్కటే ఆప్షన్ గా ఉంది

Update: 2023-12-25 09:07 GMT

దేశంలో జాతీయ స్థాయిలో రెండే రెండు కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ నాయకత్వాన ఎన్డీయే కూటమి, రెండు కాంగ్రెస్ నాయకత్వాన ఇండియా కూటమి. ఈ రెండింటిలోనే ఆప్షన్ ఎవరైనా ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో చూస్తే మూడు ప్రధాన పార్టీల నేతలు ఈ రెండు కూటములలో వేటిలోనూ లేరు. బీఆర్ఎస్ అధినేత కేసీయార్ తనదే జాతీయ పార్టీ అని చెప్పేశారు. ఆయనకు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధిగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంది.

ఆ తరువాత బీజేపీ ఉంది. దాంతో కేసీయార్ న్యూట్రల్ గానే ఉంటారు. ఇక ఏపీలో చూస్తే జగన్ కి ఎన్డీయే ఒక్కటే ఆప్షన్ గా ఉంది. ఆయనకు కాంగ్రెస్ తో అసలు కుదరదు కాబట్టి ఆ వైపు చూసే చాన్స్ లేదు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి రెండు ఆషన్లూ రెడీగానే ఉన్నాయి. పైగా బాబు కాంగ్రెస్ తో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

దాంతో ఆయన్ని బీజేపీ వైపు కాకుండా ఇండియా కూటమి వైపుగా నడిపించేందుకు ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు అని అంటున్నారు. అందుకే ఆయన అతి పెద్ద రాజకీయ లక్ష్యంతోనే టీడీపీ వైపు వచ్చారు అని అంతున్నారు. దేశంలో 2024 ఎన్నికల్లో ఎన్డీయే ఇండియా కూటముల మధ్య హోరా హోరీ పోరు సాగనుంది.

ఆ టైంలో న్యూట్రల్ గా ఉండే కొన్ని ప్రాంతీయ పార్టీలు తులాబారంగా మారుతాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తన ఒక్క పార్టీ మాత్రమే కాకుండా మరిన్ని పార్టీలను కూడగట్టే నేర్పరిగా ఉన్నారు. దాంతో ఆయనను కనుక ఇండియా కూటమి వైపుగా తిప్పినట్లు అయితే కచ్చితంగా రేపటి రోజున దేశంలో ప్రభుత్వం మారుతుంది అన్న ఆలోచనలతోనే పీకే ఈ వైపు వచ్చారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఈ పీకే రాకతో మిత్రపక్షంగా ఉన్న పవక్ కళ్యాణ్ అలియాస్ పీకే ప్రాముఖ్యత తగ్గిందా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉండాలని కోరుకుంటున్నారు. టీడీపీని కూడా అదే విధంగా డ్రైవ్ చేయాలని చూస్తున్నారు. ఇక బీజేపీని టీడీపీ జనసేన కూటమిలోకి ఆహ్వనిస్తున్నారు.

ఇవన్నీ గమనించిన మీదటనే ప్రశాంత్ కిశోర్ ఇండియా కూటమి వైపుగా టీడీపీని తిప్పే యత్నం చేస్తున్నారు అని అంటున్నారు. పీకే సూచనలతోనే నారా లోకేష్ చంద్రబాబే అయిదేళ్ల సీఎం అని గట్టిగా చెప్పారని అంటున్నారు. అంటే టీడీపీదే రాజ్యం అన్నట్లుగా ఆ పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు

ఇక ఏపీలో టీడీపీ కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ తో పొత్తు కలపాలని చూస్తోంది అని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి ఈ కూటమి తరఫున ప్రచారం చేస్తారు అన్ని విధాలుగా అండగా ఉంటారు అని ఆలోచిస్తున్నారు.

ఇలా చాలా సమీకరణల నేపధ్యంలోనే పీకే విత్ బాబు మీటింగ్ జరిగింది అని అంటున్నారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాకూడదు అని పీకే భావిసున్నారు అంటున్నారు. వైసీపీని కూడా ఇండియా కూటమి వైపుగా తిప్పాలని పీకే ప్రయత్నించి విఫలం అయ్యారని కూడా టాక్ నడుస్తోంది. వైసీపీతో పీకే దూరం కావడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు ఇండియా కూటమికి జై కొడతారా లేదా అన్నది త్వరలో తేలనుంది.

Tags:    

Similar News