'ధూమ్' మ్యూజిక్ డైరెక్టర్ కి దెబ్బకొట్టిన ఆఫీస్ బాయ్.. అసలేమైంది?
దీంతో.. కాసేపటి తర్వాత అసలు విషయం తెలిసింది.
బాలీవుడ్ లోని ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఆఫీస్ బాయ్ షాకిచ్చాడు. ఇంట్లో సరుకులు ఇచ్చి వస్తాను అని చెప్పి వెళ్లి.. ఎప్పటికీ తిరిగిరాలేదు. దీంతో.. కాసేపటి తర్వాత అసలు విషయం తెలిసింది. ఇందులో భాగంగా.. ఆఫీసు లాకర్ లోని రూ.40 లక్షలు పట్టుకుని అతడు పరారైపోయినట్లు గుర్తించి, ఫిర్యాదు చేయగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అవును... బాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తికి ఆఫీస్ బాయ్ బూతీరామ్ సాయల్ ఊహించని షాకిచ్చాడు. ప్రీతమ్ వద్ద ఎంతోకాలంగా పనిచేస్తోన్న బూతీరామ్ సాయల్ చాలా నమ్మకంగా ఉండేవాడంట. ఈ క్రమంలో ఇంట్లో సరుకులు ఇచ్చి వస్తానని చెప్పి వెళ్లిన అతడు ఎప్పటికీ తిరిగి రాలేదు. దీంతో ప్రీతమ్ కు అనుమానం వచ్చిందట.
ఈ సమయంలో తన ఆఫీస్ లాకర్ చెక్ చేయగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించారని అంటున్నారు. దీంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సాయల్ కోసం గాలింపు చేపట్టారు. ఈ సమయంలో దర్యాప్తులో భాగంగా సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో.. తాజాగా నిందితుడిని ముంబై మలాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఇతడిని జమ్మూకశ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన పోలీసులు.. ఎంతోకాలంగా నమ్మకంగా పనిచేస్తోన్న సాయల్... సరుకులు ఇంట్లో ఇచ్చి వస్తానని చెప్పి రూ.40 లక్షల సొమ్మున్న బ్యాగ్ తో పరారయ్యాడని తెలిపారు.
కాగా... బాలీవుడ్ లో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్.. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇందులో భాగంగా.. ధూమ్, గ్యాంగ్ స్టర్, ధూమ్ 2, డార్లింగ్, రేస్ వంటి సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.