అంశం ఒకటే... మోహన్ బాబు, మనోజ్ లకు షాకులు విడివిడిగా..!

ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మోహన్ బాబుపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు.

Update: 2025-01-20 09:35 GMT

గత కొన్ని రోజులుగా మోహన్ బాబు పేరు మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఇటీవల జల్ పల్లిలోని తన కుటుంబ వివాదం నేపథ్యంలో జర్నలిస్టుపై దాడి, ఆ ఘటనలో అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడం.. మరోపక్క మనోజ్ పై వరుస ఫిర్యాదులు చేస్తుండటంతో.. మోహన్ బాబు హాట్ టాపిక్ గా మారుతున్నారు.

తాజాగా జల్ పల్లి లోని తన ఆస్తులు కొంతమంది ఆక్రమించుకున్నారని.. అక్రమంగా అనుభవిస్తున్నారని.. వాటిని తనకు ఇప్పించాలని.. సీనియర్ సిటిజన్ యాక్ట్ మేరకు కోరుతున్నానంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు మోహన్ బాబు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మోహన్ బాబుపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు.

అవును... మోహన్ బాబు యూనివర్శిటీ బెదిరింపులకు పాల్పడుతోందంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ లేఖ విడుదలైంది. ప్రైవేటు హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులను ఖాళీ చేయాలని ఎంబీయూ సిబ్బంది నుంచి వేధింపులు వస్తున్నట్లు చెబుతున్నారు!

యూనివర్శిటీ హాస్టల్స్ లో ఉండకుండా.. బయట ప్రైవేటు హాస్టల్స్ లో ఉంటున్నప్పటికీ తమకు ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని.. అలాకానిపక్షంలో హాల్ టిక్కెట్స్ ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది. ఇటు లోకల్, అటు నాన్-లోకల్ విద్యార్థులు తమ హాస్టల్స్ లో ఉంటూ యూనివర్శిటీలో చదువుకుంటున్నారని హాస్టల్స్ యజమానులు చెబుతున్నారు.

ఈ మేరకు శ్రీ షిరిడీ సాయిబాబా హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ పేరు మీద ఈ లేఖ ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు విడుదలైంది!

మనోజ్ కు షాకిచ్చిన హాస్టల్ యజమానులు!:

ఓ పక్క మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బంది తమను వేదిస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లకు శ్రీ షిరిడీ సాయిబాబా హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాశారనే విషయం తెరపైకి రాగా.. మరోపక్క సాయినాథ్ ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యం నుంచి మంచు మనోజ్ కు లేఖ విడుదలైందని.. ఇందులో మనోజ్ కు వారు షాకిచ్చారనే విషయం మరోపక్క వైరల్ గా మారింది.

అవును... ఓ పక్క మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బంది తమను వేదిస్తున్నారంటూ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ లేఖ తెరపైకి రాగా... తిరుపతి ఏ రంగంపేట హాస్టల్స్ యజమానులు మంచు మనోజ్ కు లేఖ రాశారు! ఇందులో భాగంగా.. తమకేదో సమస్య ఉన్నట్లు, అవి అతనికి చెప్పినట్లు మనోజ్ మీడియాలో మాట్లాడుతున్నారని.. హాస్టల్ విద్యార్థులకు యాజమాన్యంతో ఎలాంటి సమస్యలూ లేవని వారు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... తమకు ఎలాంటి సమస్యలూ లేవని.. ఒకవేళ ఉన్నా వాటిని మోహన్ బాబు, మంచు విష్ణుతో చెప్పుకుంటామని.. వారు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారని.. వర్శిటీల యూజమాన్యంతో తమ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు ఎలాంటి సమస్యలూ లేవని వారు ఆ లేఖలో పేర్కొన్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... అసలు మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ ప్రాంతంలో భూములు అభివృద్ధి చెందయని.. కనుమ రోజు యూనివర్శిటీ గేటును తన్నటం చుసి ఆశ్చర్యపోయామని చెబుతూ... మనోజ్ ‘మీ స్వార్థం కోసం మా బ్రతుకులతో ఆడుకోవద్దు.. మమ్మల్ని రోడ్డుపైకి లాగొద్దు’ అంటూ వారు లేఖలో పేర్కొన్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఏది ఏమైనా... ఒకే విషయంపై ఇలా రెండు భిన్నమైన లేఖలు తెరపైకి వచ్చాయనే విషయం సంచలనంగా మారింది. ఇందులో ఏది వాస్తవం.. మరేది బలవంతం అనే విషయం తేలాల్సి ఉందని, తెలియాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా... ప్రైవేటు హాస్టల్స్ పేరుమీద మరోసారి మంచు ఫ్యామిలీ మెంబర్స్ హాట్ టాపిక్ గా మారారని అంటున్నారు!

Tags:    

Similar News