ఔను.. వారిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు.. ఎంపీ తండ్రి క్లారిటీ!

ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి పెళ్లి పై ప్రియ తండ్రి.. ఎమ్మెల్యే తుఫాని సరోజ్ క్లారిటీ ఇచ్చేవారు. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ఆయన.. ‘వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి.

Update: 2025-01-21 03:59 GMT

ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్.. క్రికెటర్ కం టీమిండియా సభ్యుడైన రింకు సింగ్ లు పెళ్లి చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావటం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయిందని వార్తలు రావటంతో ప్రియ తండ్రి ఈ వార్తల్ని ఖండించారు. రింకు కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతున్నట్లుగా చెప్పారు. ఎంగేజ్ మెంట్ జరిగిందన్నది అబద్ధమని చెప్పారు.

ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి పెళ్లి పై ప్రియ తండ్రి.. ఎమ్మెల్యే తుఫాని సరోజ్ క్లారిటీ ఇచ్చేవారు. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ఆయన.. ‘వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి.

రింకు.. ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉంది. వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ.. పెళ్లి చేసుకోవటానికి ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురుచూశారు. వీరి వివాహానికి రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నాయి. ఎంగేజ్ మెంట్ జరగలేదు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఎంగేజ్ మెంట్.. పెళ్లి డేట్స్ ను ఫిక్సు చేస్తాం’ అని పేర్కొన్నారు.

ఎంగేజ్ మెంట్ మాత్రం లక్నోలో జరుగుతుందని చెప్పిన ఆయన.. మచిలీషహర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. దీనికి ముందు మూడుసార్లు ఆయన ఎంపీగా పని చేశారు. ఆయన ఎంపీగా వ్యవహరించిన నియోజకవర్గంలోనే ప్రియా సరోజ్ ఎంపీగా గెలుపొందారు. ఆమె గతంలో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News