ప్రియాంక గాంధీ ఫ్యామిలీ అన్ని కోట్లు బాకీ పడిందా?

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. కేరళలోని వయనాడ్ లో లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-10-24 08:04 GMT

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. కేరళలోని వయనాడ్ లో లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థిర, చరాస్తుల వివరాలు, సంపద లెక్కలు వెల్లడించారు. ఇదే సమయంలో... తన భర్త రాబర్ట్ వాద్రాకు ఐటీ నుంచి నోటీసులు వచ్చిన విషయం తెరపైకి వచ్చింది.

అవును... వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... తన ఆస్తుల విలువ రూ.12 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇందులో... తన వద్ద రూ.4.27 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని.. అందులో మూడు బ్యాంకు ఖాతాల్లో వివిధ మొత్తాల డిపాజిట్లు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు ఉన్నాయని వెల్లడించారు. ఇదే సమయంలొ. హోండా సీఆర్వీ కారు ఉన్నట్లు తెలిపారు. ఆమె భార్త వాద్రా బహుమతిగా రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదే క్రమంలో.. భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన స్థిరాస్తులను ప్రకటించిన ప్రియాంక గాంధీ... అవి రూ.7.41 కోట్లుగా వెల్లడించారు. వీటిలో వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా నివాస ఆస్తి మొదలైనవి ఉన్నట్లు తెలిపారు. ఇక ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు రూ.39 కోట్ల చరాస్తులు, రూ.27.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు!

ఆ సంగతి అలా ఉంటే.. అసెస్మెంట్ ఇయర్ 2010 నుంచి 20 వరకూ భారీ మొత్తంలో చెల్లించాలంటూ తన భర్త వాద్రాకు నోటీసులు వచ్చయంటూ సీఐటీ(ఏ) వద్ద అప్పీల్ చేశారు ప్రియాంక గాంధీ. అవును... రూ.75 కోట్ల పన్ను బకాయిలు / పెనాల్టీ/అసెస్ మెంట్ ఆర్డర్లపై ప్రియాంక గాంధీ కుటుంబం కమీషనర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ వద్ద అప్పీల్ చేసింది!

ఇందులో భాగంగా అసస్మెంట్ ఇయర్ 2012 - 13లో రూ.15.75 లక్షలు చెల్లించాలని ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చిందని ప్రియాంక గాంధీ అఫిడవిట్ లో ప్రకటించారు! ఆ తర్వాత ఏడాది రీఫండ్స్ పోగా ఆ విలువ రూ.11.11 లక్షలుగా ఉందని వెల్లడించారు! అయితే అసస్మెంట్ ఇయర్ 2010 నుంచి 20 వరకూ మాత్రం భారీ మొత్తం చెల్లించాలని నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు!

ఇందులో భాగంగా... అసెస్మెంట్ ఇయర్ 2010 నుంచి 20 వరకూ రూ.75 కోట్లు చెల్లించాలని 2023 మార్చి 20న తన భర్త వాద్రాకు నోటీసులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు!

Tags:    

Similar News