హక్కుల యోధుడు ప్రొఫెసర్ సాయిబాబా ఇకలేరు

తెలుగువాడు, హక్కుల యోధుడిగా.. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా సుపరిచితుడైన జీఎన్ సాయిబాబా కన్నుమూశారు.

Update: 2024-10-13 04:34 GMT

తెలుగువాడు, హక్కుల యోధుడిగా.. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా సుపరిచితుడైన జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. మానవ హక్కుల కోసం పోరాడేవారంతా ఆయన్ను దేవుడిగా ఆరాధిస్తారు. అదే సమయంలో రాజ్యం మాత్రం ఆయన్ను ఒక సంఘ విద్రోహిగా చూస్తుంటుంది. మావోలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్టు చేసి.. ఆయన్ను సుదీర్ఘ కాలం జైల్లో ఉంచారు. ఇటీవల కాలం ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

90శాతం వైకల్యంతో వీల్ ఛైర్ కే పరిమితమైన ఆయన్ను మావోలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో జైలుకు పరిమితం చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యహింసకు ఇంతకు మించిన సాక్ష్యం లేదంటూ పలువురు మండిపడుతుంటారు. మావోలతో సంబంధాలు పెట్టుకొని దేశ ద్రోహానికి పాల్పడినట్లుగా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన వారం క్రితమే హైదరాబాద్ లోని నిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కన్నుమూశారన్న వార్త బయటకు రాకవటంతో మానవ హక్కుల కార్యకర్తలు.. పోరాట యోధులు.. ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మావోలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన్ను 2014లో పోలీసులు అరెస్టు చేశారు.

2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.దాదాపు తొమ్మిదేళ్లు జైల్లోనే ఉన్న ఆయన.. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబా3ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాగపూర్ జైలు నుంచి విడుదలైన ఆయన తన సొంతూరు అయినహైదరాబాద్ కు వచ్చేశారు. మానవ హక్కుల ఉద్యమకారుడుగా.. రచయితగా.. విద్యావేత్తగా సాయిబాబా సుపరిచితుడు.

Tags:    

Similar News