వీడియో... ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనీ చూశారా?

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ.. తమ సర్ ప్రైజ్ ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తున్నారు.

Update: 2024-05-27 12:30 GMT

న్యూయార్క్‌ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టాచ్యూ ఫుల్ ఫేమస్. అలాంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇప్పుడు భారత్ లోనూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నేట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ.. తమ సర్ ప్రైజ్ ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తున్నారు.

అవును... వరల్డ్ ఫేమస్ అయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ లో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే! ఈ క్రమంలో తాజాగా పంజాబ్‌ లోని తరణ్‌ తారణ్‌ ప్రాంతంలోనూ ఈ విగ్రహం కనిపించింది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్‌ పై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నమూనాను నిర్మిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అలోక్‌ జైన్‌ అనే నెటిజన్‌ ఈ వీడియోను పంచుకుంటూ.. పంజాబ్‌ లో ఓ ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏర్పాటు చేశారు అని తెలిపారు. దీంతో ఈ పోస్టు వైరల్‌ గా మారింది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు చేస్తున్న కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.

ఇందులో భాగంగా... "అది తప్పకుండా వాటర్‌ ట్యాంక్‌ అయి ఉంటుంది. ఎందుకంటే.. పంజాబ్‌ లో విమానం, ఎస్‌యూవీ మొదలైన ఆకారాల్లో వాటర్ ట్యాంక్‌ లు ఉంటాయి" అని కామెంట్ చేశారు. ఇదే సమయంలో.. "మీరు కోరుకున్న దేశానికి వెళ్లడానికి వీసా దొరకకపోతే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు" మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు.

అదేవిధంగా... "ఇకపై లిబర్టీని చూడాలంటే మనం న్యూయార్క్‌ వెళ్లాల్సిన అవసరం లేదు.. పంజాబ్ వెళ్తే సరిపోతుంది" అంటూ మరో నెటిజన్‌ చమత్కరించారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3,26,000 మంది నెటిజన్లు వీక్షించడం గమనార్హం.

కాగా... 1884లో యూఎస్‌ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని ఫ్రాన్స్‌ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది న్యూయార్క్‌ లోని బేలోని లిబర్టీ ద్వీపంలో ఉంది. ఇక.. ఈ విగ్రహం ఎత్తు 305 అడుగుల కాగా... గ్రీకు పురాణాల్లోని స్వేచ్ఛాదేవత విగ్రహాన్ని పోలీవుంటుంది. ఈ విగ్రహం కుడి చేతిలో దివిటీ, ఎడమ చేతిలో స్వాతంత్ర ప్రకటనకు సంబంధించిన పుస్తకం ఉంటాయి.

Tags:    

Similar News