'పుతిన్ - ట్రంప్.. ఓ రహస్య స్నేహం'... తెరపైకి సంచలన విషయం!

ఇది యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తుని నిర్ధేశించే అవకాశం ఉందా అనే చర్చా తెరపైకి వచ్చింది.

Update: 2024-10-09 07:33 GMT

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అదిరోహించేది ఎవరు అనే చర్చ బలంగా నడుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో హరీస్ – ట్రంప్ మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ సమయంలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

అవును... మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇది యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తుని నిర్ధేశించే అవకాశం ఉందా అనే చర్చా తెరపైకి వచ్చింది. అదే... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ట్రంప్ రహస్యంగా టచ్ లో ఉన్నారనే విషయం!

వివరాళ్లోకి వెళ్తే... అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. అత్యంత రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టచ్ లో ఉన్నారని.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రహస్యంగా ఆ దేశానికి టెస్ట్ కిట్లు కూడా పంపించారని చెబుతూ.. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పెర్కొన్నారు.

జర్నలిస్ట్ బాబ్ వుడ్ వర్డ్ రాసిన "వార్" అనే పుస్తకం అక్టోబరు 15న విడుదల కానుంది. అయితే... ఈ లోపే ఆ పుస్తకంలోని పలు కీలక విషయాలను అమెరికా మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ – వ్లాదిమిర్ పుతిన్ కి సంబంధించి రహస్య స్నేహం ఉందనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది.

ఇందులో భాగంగా... ఈ ఏడాది ఆరంభంలో తన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి ట్రంప్ అత్యంత రహస్యంగా పుతిన్ తో ఫోన్ కాల్ మాట్లాడినట్లు జాబ్ ఆ పుస్తకంలో వెల్లడించారని యూఎస్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 2011లో ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయినప్పటినుంచీ పుతిన్ తో కనీసం 7సార్లు రహస్యంగా మాట్లాడినట్లు ఈ పుస్తకంలో తెలిపారు జాబ్!

ఇదే సమయంలో 2020లో కోవిడ్ సమయంలో టెస్ట్ కిట్ల కొరత విపరీతంగా ఉన్న వేళ పుతిన్ వ్యక్తిగత వినియోగం కోసం ట్రంప్ కొన్ని కిట్లను బహుమతిగా పంపించారనీ జాబ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

దీంతో... ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష ఎన్నికల వేళ ఈ వార్త ట్రంప్ భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఏ విధంగా విరుచుకుపడబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News