ఓటమికి పాత కారణం కొత్తగా చెప్పిన వైసీపీ నేత!

ఇందులో భాగంగా... తమ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీయే తమ ఘోర ఓటమికి ప్రధాన కారణం అంటూ చాలా మంది వైసీపీ నేతలు ఒక క్లారిటీకి వచ్చారనే కామెంట్లు వినిపించాయి.

Update: 2024-11-21 09:29 GMT

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో అప్పటి అధికార పక్షాన్ని 23 స్థానాలకు పరిమితం చేసి రికార్డ్ స్థాయిలో 151 స్థానాలు దక్కించుని అధికారంలోకి వచ్చిన పార్టీ.. 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో ఈ స్థాయి ఘోర ఓటమికి కారణాలపై చర్చలు జరిగాయి.

 

ఇందులో భాగంగా... తమ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీయే తమ ఘోర ఓటమికి ప్రధాన కారణం అంటూ చాలా మంది వైసీపీ నేతలు ఒక క్లారిటీకి వచ్చారనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో... అదే విషయాన్ని చెబుతూ.. మద్యం విషయంలో మందుబాబులను చంద్రబాబు అడ్డంగా మోసం చేశాడంటూ మండిపడ్డారు శివప్రసాద్ రెడ్డి.

అవును... వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గడిచిన ఎన్నికల్లో తాఉ ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే అని.. అయితే వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మందుబాబులను కూడా చంద్రబాబు మోసం చేశాడని అన్నారు.

ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టిన చంద్రబాబు లబ్ధి పొందారని.. ఎన్నికలు అయిన తర్వాత మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలోని మద్యం బ్రాండ్ లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని.. అయితే గతంలో ఉన్న బ్రాండ్లే అదే ధరతో ఈ ప్రభుత్వంలోనూ ఉన్నాయని అన్నారు.

మరి.. తాను అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని రాచమల్లు ప్రశ్నించారు. నాడు జగన్ ప్రభుత్వంలో మద్యం అధిక ధరలు అని చెప్పిన బాబు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయాడని.. 99 రూపాయలకే మద్యం అన్నాడు కానీ.. ఆ చీప్ లిక్కర్ మాత్రం దొరకడం లేదని ఫైర్ అయ్యారు!

ఈ సందర్భంగా.. "మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు? జగన్ ప్రభుత్వంలో విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా? ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?" అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే చీప్ లిక్కర్ రూ.99 కి అమ్ముతుంటే.. అదే మద్యం కేరళలో రూ.85కి ఇస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా మందుబాబులను మోసం చేసిన చంద్రబాబు.. మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారని అన్నారు. వారికి తొలుత 20% మార్జిన్ అని చెప్పి.. ఇప్పుడు 9.5 శాతం మార్జిన్ ఇస్తున్నారని.. విచ్చల విడిగా బెల్టు షాపులు వెలిశాయని.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని.. చంద్రబాబు మద్యాని ఏరులై పారిస్తున్నారంటూ రాచమళ్లు ఫైర్ అయ్యారు!

Tags:    

Similar News