అల్లు అర్జున్ కు నరఘోష తగిలిందా..?
అవును... అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ పుష్పా-2 సినిమాతో గత రికార్డులన్నీ తిరగరాశారనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టైన అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి అంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అల్లు అర్జున్ రాత్రంతా నేలపైనే పడుకున్నారని కథనాలొస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... సుమారు 20 ఏళ్ల తన సినిమా కెరీర్ లో అల్లు అర్జున్ కి పుష్ప-2 స్థాయి హిట్ రాలేదని.. దీంతో దిష్టి / నరఘోష తగిలి ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ పుష్పా-2 సినిమాతో గత రికార్డులన్నీ తిరగరాశారనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలోని జాతర సీన్, క్లైమాక్స్ ఫైట్ లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన రఘురామ... అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని.. చాలా బాధనిపించిందని.. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని కామెంట్ చేశారు! పుష్ప-2 యూనిట్ బెనిఫిట్ షో ఏర్పాటు చేస్తే.. ఈ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. బెనిఫిట్ షోకు నిర్మాతలు ఆహ్వానిస్తే అర్జున్ వెళ్లారని అన్నారు.
అయితే.. ప్రమాదం ప్రమాదమే అని అన్నారు. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి చనిపొవడం బాధాకరమని తెలిపారు. ప్రాణం విలువ అపారమైనదే కానీ.. అది ప్రమాదం అని ట్రిపుల్ ఆర్ అన్నారు. ఈ ప్రమాదానికి ఓ వ్యక్తిని బాధ్యుణ్ని చేయడం అందులోనూ సంబంధం లేని వ్యక్తిని బాధ్యుణ్ని చేయడం కరెక్ట్ కాదని రఘురామ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా... బెనిఫిట్ షోకు ప్రభుతమే అనుమతి ఇచ్చినప్పుడు జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుణ్ని చేయడం, అరెస్ట్ చేయడం ఎంత వరకూ సమంజసం అంటు రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఈ అరెస్ట్ రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా అనే విషయం తనకు తెలియదని ట్రిపుల్ ఆర్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే... పుష్ప-2 సినిమా వెయ్యి కోట్లు దాటిందని చెప్పిన రఘురామ.. అల్లు అర్జున్ కు నరఘోష తగిలి ఉంటుందని చెబుతూ.. అంతా మంచే జరుగుతుందని తెలిపారు. దీంతో... ఆ తరహా విషయాలు నమ్మేవాళ్లు చాలా మంది... నిజంగానే అల్లు అర్జున్ కు దిష్టి / నరఘోష వంటివి తగిలాయా అని చర్చించుకుంటున్నారని తెలుస్తుండటం గమానార్హం.