కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు... బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

అవును... కొద్ది సేపటి క్రితం కేసీఆర్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-06-13 13:44 GMT

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ బలపడే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని పలు కీలక పార్టీల నేతలపై ఈడీ ప్రయోగం ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటిని అలా చూడకూడదు.. తప్పు చేస్తే బీజేపీ వదిలిపెట్టదన్నదే ముఖ్యం అని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... కేసీఆర్ పై కేసు నమోదైందని అంటున్నారు బీజేపీ ఎంపీ.

అవును... కొద్ది సేపటి క్రితం కేసీఆర్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన రావు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ ఎంపీ జోక్ అయితే చేసి ఉండరని కొంతమంది అంటున్నారు.

మెదక్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సందర్భంగా రఘునందన్ రావుకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాట్లాడిన రఘునందన రావు... మెదక్ లో తన గెలుపు బూత్ కమిటీ అధ్యక్షుల గెలుపు అని అన్నారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.1000 కోట్లు పెట్టినా వాటిని లెక్కచేయకుండా గెలిచామని అన్నారు.

గతంలో దుబ్బాకలో దెబ్బకొట్టిన ఆరడుగుల హరీష్ ఎగిరిండని చెప్పిన రఘునందన్... మెదక్ ప్రజలకు తాను జీవితకాలం రుణపడి ఉంటానని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసల్ల పండగ అని హెచ్చరించారు! ఈ క్రమంలోనే... బీఆరెస్స్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని అన్నారు.

ఇందులో భాగంగా... కొద్ది సేపటి క్రితమే కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పిన రఘునందన రావు... గొర్రెల పంపిణీ స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు! దీంతో... ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారింది.

Tags:    

Similar News