Begin typing your search above and press return to search.

పెళ్ళికి రెడీ అంటున్న రాహుల్...పెళ్ళికూతురు ఎవరంటే ?

ఐదున్నర దశాబ్దాల వయసు రాహుల్ గాంధీది. అయితేనేమి నవ యువకుడిగా కనిపిస్తారు. ఆయనలో అందం అలా తొణికిసలాడుతోంది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 4:51 AM GMT
పెళ్ళికి రెడీ అంటున్న రాహుల్...పెళ్ళికూతురు ఎవరంటే ?
X

ఐదున్నర దశాబ్దాల వయసు రాహుల్ గాంధీది. అయితేనేమి నవ యువకుడిగా కనిపిస్తారు. ఆయనలో అందం అలా తొణికిసలాడుతోంది. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యువతులు అంతా రాహుల్ సై అంటే మేము పెళ్ళి చేసుకోవడానికి రెడీ అని అంటూంటారు.

రాహుల్ గాంధీని కూడా కాలేజీ అమ్మాయిలు ఇదే ప్రశ్న వేస్తూంటారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా రాహుల్ అక్కడికి వెళ్ళి కాలేజీ అమ్మాయిలు యువతతో ఆయన భేటీ వేశారు. ఈ సందర్భంగా కాలేజీ యువత రాహుల్ ని అడిగింది ఒక్కటే. పెళ్ళి ఎందుకు చేసుకోవడం లేదు అని. మీ ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్ళి గురించి ఒత్తిడి తీసుకుని రావడం లేదా అని.

అంతే కాదు మీరు పెళ్ళి చేసుకుంటే తప్పకుండా మమ్మల్ని పిలవాలని. అన్నింటికీ పాజిటివ్ గా రాహుల్ రెస్పాండ్ అయ్యారు. పెళ్ళికి విముఖత వ్యక్తం కూడా చేయలేదు. ఇవన్నీ ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అదే వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటి అంటే రాహుల్ పెళ్ళి చేసుకోబోతున్నారు అని. అది కూడా ఒక కాంగ్రెస్ ఎంపీని అని. ఇంతకీ ఏమా కధ అంటే అందులో బోలెడు విశేషాలు ఉన్నాయి. 54 ఏళ్ల రాహుల్ గాంధీ పెళ్ళి ఇపుడు ట్రెండింగులో ఉంది. ఆయన పెళ్ళి ఫలానా అమ్మాయితో అని కూడా కన్ ఫర్మ్ చేస్తున్నారు.

రాహుల్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండే అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా పనిచేసిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే కుమార్తె అని అంటున్నారు. ఆమెతోనే రాహుల్ గాంధీ వివాహం జరుగుతోంది అని పుకార్ల మీద పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ ఇద్దరి పరిచయం ఏమిటి ఎక్కడ కలిశారు అంటే రాహుల్ గాంధీ ఆ మధ్యన భారత్ జోడో యాత్ర చేశారు. ఆ యాత్రలో ప్రణతి షిండేతో కలసి చేయి కలిపి మరీ రాహుల్ నాడిచారు అని ఫోటోలు విజువల్స్ ని చూపిస్తున్నారు. అంతే కాదు ఈ ఇద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నారు అని కధలు కూడా అల్లుతున్నారు. దాంతోనే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని కూడా పుకార్లు పుట్టించేస్తున్నారు

అంతే కాదు ఇటీవల జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా ప్రణతి షిండే గెలిచిన తరువాత ఆమె పార్లమెంట్ లో ప్రమాణం చేసిన అనంతరం రాహుల్ గాంధీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు అని కూడా గుర్తు చేస్తున్నారు. దంతోనే రాహుల్ ఆమెని పరిణయం ఆడబోతున్నారు కాబట్టే ఆ ప్రత్యేక అభినందనలు అని కూడా ప్రచారం చేస్తున్నారు

ఇక ప్రణతి షిండే వయసు 44 ఏళ్ళు. ఆమెను అందగత్తెగా చెబుతారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. అది తండ్రి వారసత్వంగా వచ్చినా ఆమె తనదైన చురుకుదనంతో ముందుకు సాగుతున్నారు. ఉన్నత విద్యావంతురాలిగా ఉన్నారు. మరి రాహుల్ కి ఆమెకి జోడీ కుదిరితే ముచ్చటైన జంట అని కూడా నెటిజన్లు అంటున్నారు.

మరో వైపు రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ కూడా తన అన్న పెళ్ళి చేసుకోవాలని కోరుతూనే ఉన్నారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ అదే విషయం మీద ఎంతో ఆశతో ఉన్నారు. మరి అందరి కోరికనూ రాహుల్ మన్నించి పెళ్ళి పీటలు ఎక్కుతారా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా రాహుల్ పెళ్ళి గురించే అంతా చర్చించారు. ఇపుడు పెళ్ళి కూతురుని కూడా పక్కన పెట్టి మరీ ఫేక్ వార్తా కధనాలు అల్లుతున్నారు. మరి ఇది నిజమా కాదా అన్నది తొందరలోనే తెలుస్తుంది అని అంటున్నారు. కాబోయే ప్రధాన మంత్రి మీదే ఫేక్ వార్తలు పుట్టిస్తారా అని ఒక వర్గం చాల కోపం గా ఉంది. పైగా ఒక యువతీ పేరు కూడా ప్రచారం చేస్తారా అని ఆందోళన చేస్తున్నారు.