రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ.. మహారాష్ట్ర పోరుకు ముందస్తు స్కెచ్..

కాంగ్రెస్ ఆగ్రనేత.. లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ.. శనివారం నాడు మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో పర్యటించారు.

Update: 2024-10-06 08:19 GMT

కాంగ్రెస్ ఆగ్రనేత.. లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ.. శనివారం నాడు మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో పర్యటించారు. ఈ నేపథ్యంగా అక్కడ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ‘సంవిధాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. రిజర్వేషన్ల అంశం ప్రస్తావించారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలని.. తద్వారా రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి కూడా ఇండియా కూటమి చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రజలను రక్షించడానికి ఉంది.. అంతేకానీ భయభ్రాంతులను చేయడానికి కాదు. రాజ్యాంగాన్ని, వ్యవస్థని నాశనం చేసి .. శివాజీకి క్షమాపణలు చెప్పడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు అంటూ మోడీ పై విమర్శలు కురిపించారు. మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో ఇటీవల ఛత్రపతి భారీ విగ్రహం కూలిన ఘటనకు మోడీ క్షమాపణలు చెప్పిన విషయాన్ని మరొకసారి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగ ప్రతిని చూపించి.. నిజంగా ఇది శివాజీ ఆలోచనలకు నిదర్శనమైన అంటూ ప్రశ్నించారు.

కుల గణన ద్వారా ప్రతి కులంలో ఎంతమంది ఉన్నారు.. దేశ ఆర్థిక వ్యవస్థ పై వారికి ఎంతవరకు నియంత్రణ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో ఉందని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న 90 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను.. ముగ్గురు ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఒక్క ఆదివాసి మాత్రమే ఉన్నారని.. అయితే జనాభా లెక్కల ప్రకారం ఓబీసీలు కనీసం 50% ఉండగా, దళితుల 15%, ఆదివాసీలు 8 శాతం ఉన్నారని పేర్కొన్నారు.

దేశంలో సమానత్వం, సమైక్యత పెంపొందించే చత్రపతి సిద్ధాంతం ఇప్పుడు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంగా వారు నిర్మించిన శివాజీ విగ్రహం కొద్ది రోజులలోనే కూలిపోవడం.. వారి ఉద్దేశాలు సరిగ్గా లేవు అనే విషయానికి సాక్ష్యం అని పేర్కొన్నారు. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడిన ఈ మాటలు మరింత ఆసక్తికర పోరుకు తెర లేపుతున్నాయి.

Tags:    

Similar News