రాహుల్ గాంధీ చెప్పులకు లక్షల్లో డిమాండ్... నో ఛాన్స్ అంట!

ఈ సందర్భంగా లారీలు, ఆటోల్లో తిరుగుతున్నారు.. కాకా హోటల్స్ లో కామన్ మ్యాన్ గా కలిసిపోతున్నారు.. ఈ క్రమంలో తాజాగా చెప్పులు కుట్టారు!

Update: 2024-08-02 06:49 GMT

గతంలో పలు అవమానకరమైన విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. గతకొంత కాలంగా అటు పార్లమెంట్ లోనూ, బయటా కూడా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కాకుండా.. ప్రజానికంతో మమేకమైపోతున్నారు. ఈ సందర్భంగా లారీలు, ఆటోల్లో తిరుగుతున్నారు.. కాకా హోటల్స్ లో కామన్ మ్యాన్ గా కలిసిపోతున్నారు.. ఈ క్రమంలో తాజాగా చెప్పులు కుట్టారు!

అవును... గత కొంతకాలంగా అటు పార్లమెంట్ లోనూ, ఇటు బయటా కూడా దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సామాన్యుల్లో సామాన్యుడిలా కలిసిపోతున్నారు! ఈ క్రమంలో తాజాగా స్వయంగా తన చేతులతో చెప్పులు కుట్టారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీటికి భారీ డిమాండ్ వస్తోంది!

వివరాళ్లోకి వెళ్తే... బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ పై పరువునష్టం పిటిషన్ దాఖలైంది! ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా... ఇటీవల జూలై 26న ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టుకు హాజరయ్యారు రాహుల్. ఈ సమయంలో కొద్ది సేపు అక్కడే గడిపారు.. జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి.. చెప్పులు, షూలు కుట్టడం చూసిన రాహుల్, అవి నేర్చుకునే ప్రయత్నం చేశారు. అనంతరం రాహుల్ గాంధీ స్వయంగా చెప్పులు కుట్టారు. ఆ తర్వాత సదరు చెప్పులు కుట్టే వ్యక్తి రాంచెట్ కు షూలు కుట్టే ఎలక్ట్రిక్ మెషిన్ ను రాహుల్ గాంధీ పంపించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.

ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ.10 లక్షలు ఇస్తానని ఓ వ్యక్తి ముందుకు వచ్చారని అంటున్నారు. అయితే... ఈ భారీ ఆఫర్ ను రాంచెట్ తిరస్కరించారని అంటున్నారు. ఆ చెప్పులు చాలా విలువైనవని చెబుతూ.. వాటిని ఫ్రేం కట్టించుకుని తన దుకాణంలో పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడని చెబుతున్నారు. ఇవి అమ్మేవి కావని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది!

Tags:    

Similar News