మోడీని మానసిక వైద్యుడి వద్దకు పంపాలి: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత.. రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాహుల్‌గాంధీ.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
కాంగ్రెస్ అగ్రనేత.. రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాహుల్‌గాంధీ.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితంతో దేశంలోని ప్రజలంతా ఆశ్చర్యపోతారని వ్యాఖ్యా నించారు. దేశంలో అలాంటి ఫలితం రానుందని రాహుల్ తెలిపారు. దేశంలో నాడిని తను పసిగట్టినట్టు రాహుల్ వెల్లడించారు. ఇండియా కూటమివిజయం దక్కించుకోవడం ఖాయమని అంచనా వేశారు. ఈ విషయాన్ని చూసి దేవం దిగ్భ్రాంతికి గురైనా ఆశ్చర్యం లేదన్నారు.
తాజాగా ఆయన ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఈ నెల 25న ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలను ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ ఇరు పార్టీలు కలిసి ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ.. జూన్ 4 వ తేదీన వచ్చే ఫలితం.. దేశ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు. మోడీ లాంటి అబద్దాల కోరు ఎక్కడా లేరన్నారు.
ఢిల్లీలోని ఏడు పార్లమెంటు సీట్లలోనూ విజయం సాధిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని మోడీ కీలకమైన రాజ్యాంగం, రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై కూడా అబద్ధాలు చెబుతూ.. ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ సంపదను అనిల్, అదానీ, అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలకు 16 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి.. దోచిపెట్టారని అన్నారు.
మోడీని మానసిక వైద్యుడి దగ్గరకు పంపించాలని రాహుల్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. తాను దైవాంశ సంభూతిడినని.. తల్లీ తండ్రితో తనకు జీవ సంబంధం లేదని చెబుతుండడాన్ని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ భూమిపై జీవ సంబంధం లేని వారంటూ ఎవరూ ఉండరని.. కానీ.. మోడీ మాత్రమే అలా చెప్పుకొంటు న్నారని.. కాబట్టి ఆయనను మానసిక వైద్యుడి వద్దకు పంపించి.. చికిత్స చేయించాలని వ్యాఖ్యానించారు.