అసదుద్దీన్ మెంటల్.. దేశం నుంచి తరుముతాం: రాజా సింగ్
తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఒవైసీని ఈ దేశం నుంచి తరిమేస్తామని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.;
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై నోరు పారేసుకుంటున్నాడని, ఆయన నోరును ఫినాయిల్‌తో శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఒవైసీని ఈ దేశం నుంచి తరిమేస్తామని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. ఎక్కడకోపోయి.. పార్టీ పెట్టుకోవాల్సి వస్తుం దన్నారు.
లేకపోతే.. బీజేపీ పెద్దల కాళ్లకు మొక్కి.. కాషాయ కండువా కప్పుకొనే పరిస్థితిని తీసుకువస్తామని రాజా సింగ్ చెప్పారు. ''తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తాం. కాదంటే.. బీజేపీలో చేరి.. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటానని అసదుద్దీన్ మా పెద్దల కాళ్లు పట్టుకుంటారు. ఆ రోజు త్వరలోనే ఉంది'' అని రాజా విమర్శించారు. ముస్లింలను బుజ్జగించేందుకు ఏవో పిల్ల రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో లొల్లి పెట్టి.. ఏవో విద్వేషాలు సృష్టించేందుకు అసదుద్దీన్ ప్రయత్నిస్తు న్నారని రాజా సింగ్ మండిపడ్డారు. అయితే.. ఈ ఆటలు సాగనివ్వబోమన్నారు. అసదుద్దీన్ మైండ్ ఖరాబు అయిందని.. ఆయన పాత మిత్రుడు(కేసీఆర్) ఓడిపోవడంతో మెంటలెక్కిందన్నారు. అందుకే కొత్త మిత్రుడి చెంతకు చేరిపోయారని వ్యాఖ్యానించారు. ''అయ్యా కొత్త మిత్రుడు గారు(రేవంత్‌రెడ్డి) మీ నాయకుడికి.. మైండ్ పోయింది.. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించండి'' అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.