రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫోర్స్ చేసింది.. అంబేద్కర్ మునిమనువడు
అయితే.. ఓ సందర్భంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు.
బీజేపీపై అంబేద్కర్ మునిమనువడు రాజారత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. చాలా డిబేట్లలో పాల్గొన్నారు. అక్కడి ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. అయితే.. ఓ సందర్భంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు. అభివృద్ధిలోనూ వారి భాగస్వామ్యం తక్కువే అని అన్నారు.
అన్నివర్గాల వారికి అవకాశాలు రావాలని, అలాంటి పరిస్థితుల కోసం తాము అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది. ప్రజలకు రిజర్వేషన్లు దూరం చేయాలన్నదే ఆయన సంకల్పం అన్నట్లు మాట్లాడారని ఫైర్ అయింది. చాలా వరకు దేశవ్యాప్తంగా రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలె వెల్లువెత్తాయి. బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
ఇదే క్రమంలో అంబేద్కర్ మునిమనవడు రాజారత్నం విడుదల చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయంశమైంది. రాహుల్ రాజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలపాలని బీజేపీ తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని సూచించారని ఆయన చెప్పారు.
కానీ.. తాను ఎలాంటి నిరసనలు తెలపలేనని నిరాకరించినట్లు రాజారత్నం వెల్లడించారు. సమాజం కోసమే తాను సేవ చేస్తున్నానని.. వారు మాత్రమే నాకు ఆదేశాలు ఇస్తారని, వారి ఆదేశాలనే పాటిస్తానని చెప్పినట్లు వివరించారు. తనను ఆదేశించే హక్కు బీజేపీకి లేదని చెప్పినట్లు తెలిపారు. తాను ఎవరికీ మద్దతుదారిడిని కాదు అని.. తనకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే.. రాజారత్నం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.