రాజాసింగ్ నోటి దూల‌.. కేసు న‌మోదు

ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న ఏకంగా పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురి కావ‌డం వెనుక కూడా ఈ నోటి దూలే కార‌ణం.

Update: 2024-01-08 07:05 GMT

చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చే టైపు.. అన్న పేరు తెచ్చుకున్న బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎక్క‌డున్నా.. నోటికి ప‌నిచెబుతూనే ఉన్నారు. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న ఏకంగా పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురి కావ‌డం వెనుక కూడా ఈ నోటి దూలే కార‌ణం. అయినా.. ఎక్క‌డా ఆయ‌న‌లో మార్పు రాక‌పోగా.. వాడ‌గావాడ‌గా క‌త్తి ప‌దును పేరిగిన‌ట్టు.. మరింత‌గా ఆయ‌న మాట‌ల మంట‌లు పెంచేస్తున్నారు.

మ‌హారాష్ట్రలో బీజేపీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో కొన్ని సునిశిత విష‌యాల‌పై కేంద్రంలోని పెద్ద‌లు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. రాజాసింగ్ ఇప్పుడు అదే విష‌యాల‌పై నోరు జారి ఇటు పార్టీ పెద్ద‌లు, అటు మ‌హారాష్ట్ర స‌ర్కారుకు కూడా ఆగ్ర‌హం తెప్పించారు. తాజాగా రాజాసింగ్ మ‌హారాష్ట్ర‌లోని పారిశ్రామిక ప‌ట్ట‌ణం షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కులు నిర్వ‌హించిన జన్‌ ఆక్రోశ్ ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీ ప్ర‌శాంతంగా సాగిపోతుండ‌గా.. రాజాసింగ్‌కు ఎక్క‌డో చీమ కుట్టింది. అంతే.. నోటికి ప‌నిచెప్పారు. బీజేపీ సునిశితంగా భావిస్తున్న రెండు కీల‌క విష‌యాల‌పై నోరు పారేసుకున్నారు. లవ్‌ జిహాదీలు, గో హంతకులపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వీరిపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే రంగంలోకి దిగుతామ‌న్నారు. అంతేకాదు.. ల‌వ్ జీహాదీలు, గోహంతకుల కనుగుడ్లు పీకి ఆటాడుకుంటామని రెచ్చగొట్టేలా ప్ర‌సంగాలు దంచి కొట్టారు.

‘‘లవ్‌ జిహాద్‌ పేరుతో మన అక్కచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు జరగడం లేదా? వాళ్లను పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చడం లేదా? లవ్‌ జిహాదీలు, గోహంతకులపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. లేక పోతే ఇలాంటి వారికి మేమే గుణపాఠం చెబుతాం. జిహాదీల కనుగుడ్లు పీకి, వాటితో ఓ ఆటాడుకుంటాం’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

ఇది స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.మ‌రో రెండు మాసాల్లో పార్లమెంటు ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నాయ‌కులు క‌న్రెర్ర చేశారు. వెంట‌నే ఆయ‌న‌పై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. జిహాదీలు, మసీదుల కూల్చివేతపై బీజేపీ ఎమ్మెల్యే స్థానిక నాయ‌కుడు రాణె కూడా ఇలానే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

Tags:    

Similar News