టీచర్లకు క్లాస్ లో నో మొబైల్ ఫోన్.. స్కూల్ టైమ్ లో నో పూజలు, నో నమాజ్!
పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని.. అవన్నీ ప్రతీ పాఠశాలలోనూ పక్కాగా అమలయ్యేలా చూస్తామని చెబుతుంది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం.
పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని.. అవన్నీ ప్రతీ పాఠశాలలోనూ పక్కాగా అమలయ్యేలా చూస్తామని చెబుతుంది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఆ రాష్ట్ర విద్యా, పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా... ఉపాధ్యాయులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
అవును... పాఠశాల విద్యావిధానంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... ఇకపై ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని.. పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ టీచర్ కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యా రంగాభివృద్ధిలో భాగంగా... రాష్ట్ర విద్యాశాఖ తాజాగా జారీ చేసిన అదేశాలు అన్నీ పక్కాగా అమలయేలా చూసేందుకు ప్రయత్నిస్తామని మంత్రి మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు తమ తమ మొబైల్ ఫోన్స్ ను స్విచ్చ్ ఆఫ్ చేయాలని.. తరగతి గదిలోకి ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని అన్నారు.
క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయుడు బోధించే సమయంలో మొబైల్ ఫోన్ మోగితే.. అది అటు ఉపాధ్యాయులతో పాటు ఇటు విద్యార్థులకూ ఇబ్బందికరంగా మారుతుందని.. చదువులకు అంతరాయం కలుగుతుందని.. ఏకాగ్రత మిస్సవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో... స్కూల్ జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా బయటకు వెళ్లకూడదని మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. ఇలాంటీ ఘటనలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు అందాయని.. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.