జగన్‌ను టెన్షన్ పెడుతోన్న వైసీపీలో ఆ ఇద్దరు మేడమ్స్...!
గతంలో రజనీ ప్రెస్‌మీట్లతో పాటు మీడియాలో చేసే హడావిడి ఒక రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు రజనీ ఫుల్ సైలెంట్ అయిపోయారు.
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఇప్పుడు వైసీపీలో ఇద్దరు మేడమ్స్ బాగా టెన్షన్ పెట్టేస్తున్నారట. జగన్ రాజధాని ప్రాంతంలో కీలక నగరం అయిన గుంటూరులో ఎప్పుడు పర్యటించినా పక్కన మాజీ మంత్రి విడదల రజనీ ఉంటున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటల తూటాలు పేల్చే రజనీ ఇప్పుడు ఒక్క మాట మాట్లాడటం లేదు. గతంలో రజనీ ప్రెస్‌మీట్లతో పాటు మీడియాలో చేసే హడావిడి ఒక రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు రజనీ ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీలో బాగా హైలెట్ అవుతోన్న శ్యామల జోరు ముందు రజనీ పూర్తిగా బేజారు అవుతున్నారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక గుంటూరుకే చెందిన మరో కీలక మహిళానేత.. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం సైలెంట్ అయిపోయారు. అసలు ఆమెను ఎన్నికలకు ముందే జగన్ నానా ఇబ్బందులు పెట్టారు. ఆమె ప్రత్తిపాడు సీటు కోరుకుంటే అది కాకుండా రాజధాని ప్రాంతం అయిన తాడికొండ సీటు ఇచ్చారు. అక్కడ పోటీ చేయడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మేడమ్స్ జగన్‌ను బాగా టెన్షన్ పెట్టేస్తున్నారట. విడదల రజనీ అయితే జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
ఆమె భర్తది కాపు సామాజిక వర్గం.. రజనీ భర్త కుమారస్వామి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారంటున్నారు. ఆయన లాబీయింగ్‌తోనే రజనీ జనసేన ఎంట్రీకి లైన్ క్లీయర్ అయ్యిందంటున్నారు.
ఇక మేకతోటి సుచరిత కూడా జగన్ పర్యటనల్లో కనపడడం లేదు. సుచరిత అయితే జగన్‌కు దూరం జరగడం.. వైసీపీకి బైబై చెప్పడం ఫిక్స్ అని.. అయితే ఆమె ఏ పార్టీలో చేరతారు ? అన్నది అంతు పట్టడం లేదంటున్నారు.
ఇక ఈ ఇద్దరు కీలక మహిళా నేతలు పార్టీ మారిపోతే గుంటూరు వైసీపీలో జగన్‌కు మిగిలేది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ లాంటి వాళ్లు మినహా ఎవ్వరూ ఉండరన్న గుసగుసలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి కూడా గుడ్ బై చెప్పారు. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య కూడా జనసేనలో చేరిపోయారు. ఓవరాల్‌గా చూస్తే గుంటూరు వైసీపీలో జగన్ మిగిలేది బలహీన నాయకులే అన్నట్టుగా కనిపిస్తున్నారు.