ఆర్జీవీ 'వ్యూహం': నిన్న పోలీసులకు మెసేజ్.. నేడు హైకోర్టులో పిటిషన్!

ఇందులో భాగంగా... తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

Update: 2024-11-20 06:30 GMT

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విచారణకు రావాలంటు ఏపీ పోలీసులు ఇటీవల ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చి నోటీసులు ఇవ్వడం.. దానిపై వర్మ హైకోర్టుకు వెళ్లడం.. అక్కడ చుక్కెదురవ్వడం తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆర్జీవీ హైకోర్టు ఆశ్రయించారు. నిన్న పోలీసులకు మెసేజ్.. పెట్టి నేడు హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తిగా మారింది.

అవును... ఈ నెల 19న విచారణకు రావాలంటూ ఏపీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ కోర్టుకు వెళ్లారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో మంగళవారం వర్మ విచారణకు తప్పనిసరిగా హాజరవుతారనుకున్న వేళ మెసేజ్ పెట్టారు!

ఇందులో భాగంగా... తనకు నాలుగు రోజులు సమయం కావాలని.. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉందని.. విచారణకు సహకరిస్తానని.. ప్రస్తుతానికి మాత్రం రాలేనని ఒంగోలు పోలీసులకు వాట్సప్ లో మెసేజ్ పెట్టారు! ఈ నేపథ్యంలో... తాజాగా మరోసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

ఇందులో భాగంగా... తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై రేపు (21 నవంబర్ - గురువారం) విచారణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం.. ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు.

దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆర్జీవీకి నోటీసులు అందించారు. ఇందులో భాగంగా... 19న విచారణకు రమ్మని తెలిపారు. అయితే.. షూటింగ్ లో బిజీగా ఉన్నానని.. నాలుగు రోజులు కావాలని కోరుతూ తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీంతో... వర్మ విచారణ అంశం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News