విసుగెత్తిపోయిన వర్మ... సంచలన నిర్ణయం!

సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఏపీలో నమోదైన కేసుల వ్యవహరం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-02 04:35 GMT

సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఏపీలో నమోదైన కేసుల వ్యవహరం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో.. మొదట్లో తీవ్ర సీరియస్ ఇష్యూగా అనిపించిన ఈ వ్యవహారం కాస్తా.. కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోయిందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఆర్జీవీ అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదులు, ఆ మేరకు నమోదైన కేసుల విషయంలో అరెస్టు అంశంపై మాత్రం తీవ్ర చర్చ జరుగుతుంది. ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారంటూ మీడియాలో బ్రేకింగ్ లు ఊదరగొట్టిన పరిస్థితి.

దీనిపై స్పందించిన వర్మ.. తాను తన డెన్ లోనే ఉన్నానని.. తనను పోలీసులు అరెస్ట్ చేయడానికి లోనికి రాలేదని, తనవారు ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదని వాదిస్తున్నారు. పైగా.. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. పరామర్శలు తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు.

అవును... రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసులు, ఆ మేరకు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇవ్వడాల సంగతి తెలిసిందే. అయితే... ‘వర్మ త్వరలో అరెస్టు’!, ‘పరారీలో వర్మ’!, ‘వర్మ కోసం పోలీసుల గాలింపు’! అంటూ మీడియాలో రకరకాల కథనాలొచ్చిన సంగతి తెలిసిందే!

ఈ నేపథ్యంలో స్పందించిన వర్మ... తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న అన్ని మీడియాలకు తన వైపు నుంచి ఓ కామన్ క్వశ్చన్ ఏమిటంటే.. పోలీసులు తనను అరెస్ట్ చేయాలనుకుంటే.. వారు ఈ రోజు వరకూ కూడా డెన్ ఆఫీసులోకి ఎందుకు రాలేదు? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో... తనపై అరెస్ట్ వారెంట్ ఉందని కానీ.. లేదా, వారి బృందాలు త్న కోసం వివిధ రాష్ట్రాల్లో, పలు ప్రాంతాల్లో వెతుకుతున్నట్లు ఒక్క పోలీస్ అధికారి కానీ చెపడం తనకు కనిపించలేదని అన్నారు. ఆ ఛానల్స్ అన్నీ తెలిసి తెలిసి తన గురించి తప్పుడు విషయాలు చెబుతున్నాయఅంటూ మండిపడ్డారు.

ఫలితంగా... ఎప్పుడూ జరగని సంఘటనలను వివరిస్తూ ప్రజలను అబద్ధాలను నమ్మేలా ప్రయత్నిస్తున్నాయని ఇది రుజువు చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థల యజమానులు, నిర్ధిష్ట యాంకర్ లతో సహా అనేక ఇతర వ్యక్తులపైనా చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు!

ఈ మేరకు వర్మ టీమ్ దీనికి సంబంధించిన అన్ని విషయాలనూ సేకరించే ప్రక్రియలో ఉందని.. ఈ మేరకు నోటీసులు పంపించాల్సిన వారి లిస్ట్ భారీగానే ఉందని అంటున్నారు. దీంతో... ఇలా తనపై వస్తోన్న తప్పుడు ప్రచారాలపై వర్మ విసిగిపోయి ఉంటారని.. దీంతో, ఇక లీగల్ యాక్షన్ కు దిగుతున్నారని అంటున్నారు!

Tags:    

Similar News