కార్టూన్ తో రామోజీరావుకు శ్రీధర్ నివాళి

ఈ రోజు రామోజీరావు పరమపదించిన వేళ తాజాగా ఆయనకు తన మార్క్ కార్టూన్ తో శ్రీధర్ నివాళులర్పించారు.

Update: 2024-06-08 13:35 GMT

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఈనాడులో కార్టూనిస్ట్ గా చాలా సంవత్సరాలు పనిచేసిన శ్రీధర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తన కార్టూన్ ల ద్వారా సుపరిచితులు. తన కార్టూన్లతో గుడ్ మార్నింగ్ చెప్పే శ్రీధర్ కొంతకాలం క్రితం ఈనాడు లో పనిచేయడం మానేసి శేష జీవితాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ తరం నెటిజన్లతో సైతం టచ్ లో ఉంటున్నారు శ్రీధర్. దివంగత రామోజీరావుతో శ్రీధర్ కు మంచి అనుబంధం ఉంది. ఈ రోజు రామోజీరావు పరమపదించిన వేళ తాజాగా ఆయనకు తన మార్క్ కార్టూన్ తో శ్రీధర్ నివాళులర్పించారు.

తన మాజీ అధినేత ఆలోచనలను ప్రతిబించేలా శ్రీధర్ వేసిన కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామాన్యుల పేపర్ గా ఈనాడును తీర్చిదిద్దాలని భావించిన రామోజీరావు ఆశయాలకు అద్దం పట్టేలా ఆ కార్టూన్ వేశారు శ్రీధర్. పోలీసులు తమ భుజాలపై తుపాకులు పెట్టుకొని మరీ సెక్యూరిటీ కల్పిస్తున్నప్పటికీ ఆ రాజకీయ నాయకుడు అభద్రతా భావంతో బిక్కుబిక్కుమని అడుగులు వేస్తున్నాడు.

మరో పక్క రామోజీరావు భుజం మీద ఈనాడు పేపర్ ను భుజాన వేసుకొని ‘పేపర్’ గన్ లా మోస్తుండగా..ఆయన, ఆయన చేతిలో ఈనాడు పేపర్ ఉందన్న ధీమాతో సామాన్యుడు చిరునవ్వులు చిందిస్తూ రామోజీతో కలిసి ముందుకు సాగుతున్నాడు. ఈనాడు ఎప్పుడూ సామాన్యుల పక్షం అని రామోజీరావు నిరూపించారని శ్రీధర్ తన కార్టూన్ ద్వారా చెప్పకనే చెబుతూ ఆయనకు ఘన నివాళి అర్పించారు.

మరోవైపు, రామోజీరావుతో గతంలో పనిచేసి ఆయనతో అనుబంధం ఏర్పరుచుకున్న ఉద్యోగులు ప్రస్తుతం శోకసంద్రంలో ఉన్నారు. రామోజీరావుతో తమ అనుభవాలు, అనుబంధం గుర్తు తెచ్చుకొని అశ్రునయనాలతో ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

Tags:    

Similar News