నాకు డిగ్రీ లేకే మంత్రి పదవి మిస్సయింది !

బొబ్బిలి మండలం కోమటిపల్లి బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-07 00:30 GMT

నేను బొబ్బిలికి రాక ముందు చెన్నైలో ఉండేవాడిని. రాజకీయాల మీద ఆసక్తితో బొబ్బిలికి వెళ్తానని అమ్మను అడిగాను. బొబ్బిలికి వెళ్తే నీ చదువు సాగదని అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. నేను బొబ్బిలిలో బాగా చదువుకుని డిగ్రీ పూర్తి చేస్తానని అమ్మను ఒప్పించాను. ఇక్కడికి వచ్చి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. కొండపల్లి శ్రీనివాస్ విదేశాల్లో చదివాడు కాబట్టి మంత్రి అయ్యాడు. నేను అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ రోజు మంత్రిని అయ్యే వాడిని’ అంటూ బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కె కె రంగారావు (బేబీనాయన) కీలక వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ కృష్ణ రంగారావు 2004 నుండి వరసగా టీడీపీ నుండి మూడు సార్లు విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో ఆయన సోదరుడు ఆర్ వి ఎస్ కె కె రంగారావు ఇటీవల ఎన్నికల్లో టీడీపీ నుండి విజయం సాధించాడు.

బొబ్బిలితో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ విజయం సాధించడం కోసం ఆర్ వి ఎస్ కె కె రంగారావు కృషిచేశాడు. బొబ్బిలి రాజవంశీయులుగా ఈ ప్రాంతంలో వీరికి గట్టిపట్టుంది. ఈ నేపథ్యంలో తనకు మంత్రిపదవి ఖాయం అని అనుకున్నాడు. తీరా పదవి రాకపోవడంతో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తన ఆవేదనను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మంత్రిపదవి రాని విషయంలో కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు పార్టీపై చేయొద్దని ఆదేశించడం విశేషం.

Tags:    

Similar News