సప్తగ్రహ కూటమి: ఈ నెల 28న విశేషమైన గ్రహసంగమం

సప్తగ్రహ కూటమి ఈ నెల 28న ప్రారంభమై మార్చి 7-8వ తేదీ వరకు కనిపించనుంది. మార్చి 3వ తేదీ రాత్రి ఈ గ్రహాల సమూహాన్ని అత్యంత స్పష్టంగా చూడడానికి ఉత్తమ సమయంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Update: 2025-02-23 00:30 GMT

ఈ నెల 28వ తేదీన అరుదైన ఖగోళ అద్భుతం చోటుచేసుకుంది. విశ్వంలోని సప్తగ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షమవనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులకే కాకుండా సామాన్య ప్రజలకూ ఇది ఒక విశేష అనుభూతిగా నిలవనుంది.

-సప్తగ్రహాల సంగమం

ఈ గ్రహసంగమంలో శుక్రుడు (వీనస్), కుజుడు (మార్స్), గురుడు (జూపిటర్), శని, యురేనస్, నెప్ట్యూన్ ఇప్పటికే కనువిందు చేస్తుండగా.. ఇప్పుడు బుధుడు (మెర్క్యురీ) కూడా వీటితో జతకట్టనుంది. ఈ అరుదైన సంఘటన మహాశివరాత్రి ముగిసిన రెండో రోజే చోటుచేసుకోవడం మరింత ప్రత్యేకతను అందిస్తోంది.

- ఎప్పుడు, ఎలా వీక్షించాలి?

సప్తగ్రహ కూటమి ఈ నెల 28న ప్రారంభమై మార్చి 7-8వ తేదీ వరకు కనిపించనుంది. మార్చి 3వ తేదీ రాత్రి ఈ గ్రహాల సమూహాన్ని అత్యంత స్పష్టంగా చూడడానికి ఉత్తమ సమయంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడు అస్తమించిన 45 నిమిషాల తర్వాత ఈ గ్రహాలను గమనించేందుకు ఉత్తమ అవకాశం లభిస్తుంది.

*ఈ ఖగోళ అద్భుతాన్ని ఎలా చూడవచ్చంటే?

- వీనస్, మార్స్, జూపిటర్, యురేనస్ గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే చూడొచ్చు.

-శని, మెర్క్యురీ, నెప్ట్యూన్ గ్రహాలను వీక్షించేందుకు స్పేస్ టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ల సహాయం అవసరం.

-భారత్‌లో ఎక్కడి నుండైనా ఈ గ్రహసంగమాన్ని తిలకించవచ్చు.

మళ్లీ ఇదే విధమైన గ్రహసంగమం 2040లో మాత్రమే చోటు చేసుకోనుంది. కాబట్టి ఇప్పుడు మిస్ అయితే మరో 15 సంవత్సరాలు వేచిచూడాల్సి ఉంటుంది.

సప్తగ్రహాల కూటమి ఖగోళ చరిత్రలో అరుదైన సంఘటన. 28వ తేదీన ప్రారంభమయ్యే ఈ గ్రహసంగమాన్ని ఖచ్చితంగా వీక్షించేందుకు సూర్యాస్తమయం అనంతరం 45 నిమిషాల లోపల ఆసమయం కేటాయించుకోవాలి. భారతదేశంలోని ఎక్కడి నుండైనా ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఖగోళ ప్రేమికులు, పరిశోధకులు, విద్యార్థులు అందరూ దీన్ని ప్రత్యేకంగా గమనించి ఆనందించవచ్చు.

Tags:    

Similar News