భార్య, కుటుంబం లేని జీవితం బాధించేది! రతన్ టాటా
అదే సమయంలో రతన్ టాటా ఆమె జీవితంలో కి ఎంటర్ అయ్యారు.
బాలీవుడ్, బెంగాలీ నటి సిమీ గ్రేవాల్ తో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపారు. అయితే సిమీ గ్రేవాల్ ప్రేమ జాబితాలో టాటా స్థానం రెండవది. తొలిసారి సిమి గ్రేవాల్కు 17 యేళ్ల వయస్సులో జామ్ నగర్ మహారాజుతో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్ల పాటు ఈ బంధం కొనసాగింది. తొలి ప్రేమ సిమీ జీవితంలో కేవలం ఓ మెమోరీగానే మిగిలిపోయింది.
ఈ టీనేజ్ ప్రేమాయణంలో ఆమె పలు భిన్నమైన, కొత్త ప్రపంచాన్ని చూసింది. కానీ మహారాజు మాత్రం ఆమెని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ బంధం వీగిపోయింది. అదే సమయంలో రతన్ టాటా ఆమె జీవితంలో కి ఎంటర్ అయ్యారు. వీరిద్దరి తమ బంధం దాచడానికి ఎనాడు ప్రయత్నించలేదు. ఇద్దరు జంటగా చాలాసార్లు మీడియాకి చిక్కారు. సిమి గ్రేవాల్ కూడా రతన్ టాటాతో తన రిలేషన్షిప్ను వెల్లడించింది.
ఈ బంధాన్ని కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ప్రేమ పెళ్లి వరకూ దారి తీయలేదు. మరి రతన్ టాటా లాంటి స్వచ్చమైన మనిషిని సిమీ ఎందుకు వదులుకుంది? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే రతన్ టాటా వ్యక్తిగత విషయాలను పంచుకునేందుకు ఇష్టపడేవారు కాదు. సిమీ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
` భార్య, కుటుంబం ఎవరూ లేరని ఒంటరిగా అనిపించేది. పెళ్లి చేసుకోనందుకు బాధగా ఉండేది. కానీ నాలుగు సార్లు పెళ్లి వరకూ వెళ్లి వచ్చాను. కానీ అవి అక్కడే ఆగిపోయాయి. తాజాగా రతన్ టాటా మృతికి సిమీ సంతాపాన్ని ప్రకటించారు.` మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆ లోటు భరించడం చాలా కష్టం. వీడ్కోలు నేస్తమా` అని ఎక్స్ వేదికగా స్పందించారు.